NTV Telugu Site icon

Mahesh Babu: #SSMB28 షూటింగ్ బ్రేక్… సంక్రాంతి వరకూ టైం ఉంది కదా…

Mahesh Rajamouli Ssmb 29

Mahesh Rajamouli Ssmb 29

సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గత రెండు సినిమాలతో బాకీ పడిన హిట్ ని సొంతం చేసుకోవడానికి హ్యాట్రిక్ సినిమాతో రాబోతున్నారు. SSMB 28 అనే వర్కింగ్ టైటిల్ తోనే రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. రీసెంట్ గా SSMB 28 ఫస్ట్ లుక్ తో సెన్సేషనల్ ఇంపాక్ట్ ఇచ్చిన మహేశ్-త్రివిక్రమ్ లు 2024 సంక్రాంతికి హిట్ కొట్టబోతున్నాం అనే నమ్మకం ఫాన్స్ లో కలిగించడంలో సూపర్ సక్సస్ అయ్యారు. టైటిల్ కూడా అనౌన్స్ చెయ్యని ఒక సినిమాకి ఈ రేంజ్ బజ్ క్రియేట్ చెయ్యడం మహేశ్, త్రివిక్రమ్ ల కాంబినేషన్ కే చెల్లింది. మదర్ సెంటిమెంట్ తో అమ్మ కథ, అమరావతికి అటు ఇటు అంటూ సాఫ్ట్ టైటిల్ ఏవో సోషల్ మీడియాలో వినిపించాయి కానీ త్రివిక్రమ్ వదిలిన పోస్టర్ లోని మహేశ్ బాబు లుక్ ని చూస్తే SSMB 28 సాఫ్ట్ సినిమాలా అనిపించట్లేదు, ఊరమాస్ సినిమాలా కనిపిస్తోంది.

బీడీ కాలుస్తూ మహేశ్ బాబు నడుస్తూ వస్తుంటే, నెక్స్ట్ సంక్రాంతికి బద్దలవ్వబోయే రికార్డులు కనిపిస్తున్నాయి. బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి పడేలా ఉంది. ప్రతి సమ్మర్ కి ఫ్యామిలీతో కలిసి ఫారిన్ ట్రిప్ వెళ్లే మహేశ్ బాబు, ఎప్పటిలానే ఈసారి కూడా రెండు మూడు వారాల పాటు ఫారిన్ వెకేషన్ వెళ్లనున్నాడు. ఈ వెకేషన్ అయిపోయే వరకూ SSMB 28 షూటింగ్ కి బ్రేక్ పడనుంది. సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతుండడంతో ఘట్టమనేని అభిమానులు… ఇది ఎప్పుడూ జరిగేదే కదా, అయినా SSMB 28 రిలీజ్ కి సంక్రాంతి వరకూ టైం ఉంది కాబట్టి ఫారిన్ ట్రిప్ వెళ్లినా ఏమీ కాదులే అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇదే షూటింగ్ స్టార్ట్ కాకముందు అయితే మహేశ్ బాబు ఫారిన్ ట్రిప్ వెళ్తే చాలు మహేశ్ ఫాన్స్ సోషల్ మీడియాలో ‘సినిమా స్టార్ట్ చెయ్ అన్నా’ అంటూ ఫ్రస్ట్రేషన్ తో కామెంట్స్ చేసే వాళ్లు. మరి మహేశ్ ఫారిన్ ట్రిప్ ఎప్పుడు కంప్లీట్ చేసుకోని వస్తాడు, తిరిగి SSMB 28 షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది చూడాలి.

Show comments