Site icon NTV Telugu

Mahesh Babu: పెళ్లి రోజున నమ్రత గురించి మహేశ్ స్పెషల్ పోస్ట్

Mahesh Babu

Mahesh Babu

సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం ఫ్యామిలీతో పాటు స్పెయిన్ లో ఉన్నాడు. తన 18వ మ్యారేజ్ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకోవడానికి నమ్రత, మహేశ్ లు ఫారిన్ వెళ్లారు. SSMB 28 షూటింగ్ బ్రేక్ లో స్పెయిన్ వెళ్లిన మహేశ్ అక్కడి నుంచి నమ్రత కోసం స్పెషల్ ట్వీట్ చేశాడు. “18 years together and forever to go! Happy anniversary NSG” అని కోట్ చేస్తూ ఒక ఓల్డ్ ఫోటోగ్రాఫ్ ని కూడా మహేశ్ షేర్ చేశాడు. ఘట్టమనేని అభిమానులు మహేశ్-నమ్రతకి పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. మిస్ ఇండియాగా బాలీవుడ్ లో కెరీర్ స్టార్ట్ చేసింది నమ్రత, సూపర్ స్టార్ కృష్ణ కొడుకుగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చాడు మహేశ్ బాబు. ఇప్పుడు అంటే పాన్ ఇండియా వల్ల అక్కడి వాళ్లు ఇక్కడ, ఇక్కడి వాళ్లు అక్కడ సినిమాలు చేస్తున్నారు కానీ అప్పుడున్న పరిస్థితులని బట్టి చూస్తే మహేశ్-నమ్రతల ప్రయాణం నిజానికి కలిసే అవకాశమే లేదు. అప్పటికే సౌత్ లో డెబ్యు చేసిన కొంతమంది హీరోయిన్స్ నార్త్ కి వెళ్లారు కానీ నార్త్ లో బిజీగా ఉన్న హీరోయిన్ సౌత్ లోకి అంతగా రాలేదు. అలా నార్త్ లో మోడల్ అండ్ హీరోయిన్ గా మంచి సినిమాల్లో నటిస్తూనే తెలుగులోకి మహేశ్ బాబు సినిమాతోనే ఎంట్రీ ఇచ్చింది నమ్రత శిరోద్కర్.

బీ.గోపాల్ దర్శకుడిగా మహేశ్ బాబు చేసిన సినిమా ‘వంశీ’. మహేశ్ సెకండ్ మూవీగా రిలీజ్ అయిన వంశీ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులని మెప్పించలేదు కానీ యావరేజ్ గా నిలిచింది. సినిమా యావరేజ్ కానీ మహేశ్ బాబుకి మాత్రం మంచి లైఫ్ పార్టనర్ దొరికింది. ఈ సినిమా షూటింగ్ సమయంలో మహేశ్-నమ్రత రిలేషన్ లోకి వెళ్లారు. ఆ తర్వాత 2005లో పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి సినిమాలకు గుడ్ బై చెప్పేసింది నమ్రత. అప్పటి నుంచి మహేశ్-నమ్రతలు చాలా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. మహేశ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంటే నమ్రత మాత్రం బిజినెస్ చూసుకుంటూ ఫ్యామిలీని లీడ్ చేస్తూ, మహేశ్ కి బ్యాక్ బోన్ గా నిలుస్తుంది. మహేశ్- నమ్రత ట్రావెల్ చెయ్యడం చూస్తే పర్ఫెక్ట్ కపుల్ గోల్స్ ఏంటో తెలుస్తాయి. ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని షూటింగ్స్ ఉన్నా మహేశ్ బాబు ఫ్యామిలీతో టైం స్పెండ్ చెయ్యకుండా ఉండడు. ఈ ఇద్దరూ ఇలానే హ్యాపీగా ఉండాలని ఘట్టమనేని అభిమానులు కోరుకుంటున్నారు.    

Exit mobile version