Site icon NTV Telugu

SSMB28: ఇది ఊహించని ట్విస్ట్.. ఆ ఇద్దరిలో ఎవరు?

Mahesh Babu Negative Shades

Mahesh Babu Negative Shades

Mahesh Babu Role To Have Negative Shades In SSMB28: త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేశ్ బాబు కాంబోలో ఓ సినిమా రూపొందనున్న విషయం తెలిసిందే! ఫిబ్రవరిలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా.. ఆగస్టులో సెట్స్ మీదకి వెళ్లేందుకు ముస్తాబవుతోంది. అయితే.. ఈ గ్యాప్‌లో ఈ సినిమాపై చాలా వార్తలే వచ్చాయి. తొలుత ఇందులో ఓ ముఖ్యమైన పాత్ర కోసం కన్నడ నటుడు ఉపేంద్రని తీసుకుంటున్నట్టు టాక్ వినిపించింది. ఆ తర్వాత మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతిని త్రివిక్రమ్ రంగంలోకి దించనున్నట్టు ప్రచారం జరిగింది. కానీ.. ఈ వార్తలపై చిత్రబృందం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనలు రాలేదు. దీంతో.. ఈ ఇద్దరిలో మహేశ్‌తో ఢీకొట్టేది ఎవరు? అనే చర్చలు సోషల్ మీడియాలో జరుగుతున్నాయి.

ఇదే సమయంలో మరో షాకింగ్ న్యూస్ కూడా చక్కర్లు కొడుతోంది. ఇందులో మహేశ్ బాబుని నెగెటివ్ షేడ్స్ ఉన్న రాజకీయ నాయకుడి పాత్రలో త్రివిక్రమ్ చూపించబోతున్నాడట! ఆ పాత్ర చుట్టూ ఒక ట్విస్ట్ ఉంటుందని, చివర్లో దాన్ని రివీల్ చేస్తారని, అందుకే నెగెటివ్ షేడ్స్ ఉండేలా హీరో పాత్రని త్రివిక్రమ్ డిజైన్ చేశాడని టాక్ నడుస్తోంది. అయితే, దీనిపై కూడా అధికార సమాచారం లేదు. ఒకవేళ ఇది నిజమే అయితే మాత్రం.. మహేశ్‌ని సరికొత్త పాత్రలో చూడబోవడం ఖాయం. ఇక ఇందులో మహేశ్ సరసన కథానాయికగా పూజా హెగ్డే నటిస్తోంది. అతడు, ఖలేజా తర్వాత మహేశ్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో రూపొందుతోన్న మూడో సినిమా కావడంతో.. దీనిపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు తగినట్టుగానే స్టోరీని త్రివిక్రమ్ పడక్బందీగా సిద్ధం చేస్తున్నాడని తెలుస్తోంది.

Exit mobile version