ఈ సినిమా పై మహేష్ బాబు ప్రశంసల వర్షం కురిపించారు. మహేష్ బాబు తన ప్రైవేట్ థియేటర్లో కుటుంబ సభ్యులతో కలిసి బావమర్ది సుధీర్ బాబు కొత్త చిత్రమైన “శ్రీదేవి సోడా సెంటర్”ను వీక్షించారు. అనంతరం సినిమాపై ప్రశంసల వర్షం కురిపిస్తూ రివ్యూ ఇచ్చారు. “శ్రీదేవి సోడా సెంటర్” క్లైమాక్స్ రా, ఇంటెన్స్, హార్డ్ హిట్టింగ్. పలాస 1978 తర్వాత దర్శకుడు కరణ్ కుమార్ మరో బోల్డ్ చిత్రంతో వచ్చాడు. సుధీర్ బాబు బ్రిలియంట్. ఇప్పటి వరకు ఎన్ని నటించిన సినిమాలలో ఇదే బెస్ట్ పర్ఫార్మెన్స్. నరేష్ ది మరో గుర్తుండిపోయే పాత్ర, పర్ఫామెన్స్. ఆనంది శ్రీదేవి పాత్రలో ఒదిగి పోయింది. ఆ పాత్రకు సరిగ్గా సరిపోయింది. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అద్భుతం. ఈ సినిమాను అస్సలు మిస్ అవ్వద్దు. మరోసారి చిత్రబృందం మొత్తానికి కంగ్రాచ్యులేషన్స్” అంటూ వరుస ట్వీట్లు చేశారు. హీరోయిన్ ఆనంది గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం విశేషం. మొత్తానికి “శ్రీదేవి సోడా సెంటర్” మొదటి రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.
Read Also : సూర్యతో అగ్ర తమిళ దర్శకుల సూపర్ హీరో మూవీ!?
70 ఎం.ఎం. ఎంటర్టైన్మెంట్ పతాకంపై సుధీర్ బాబు, ఆనంది జంటగా ‘పలాస 1978’ ఫేమ్ కరుణ కుమార్ దర్శకత్వంలో విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి సంయుక్తంగా నిర్మించిన సినిమా ‘శ్రీదేవి సోడా సెంటర్’. ఆగష్టు 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు “సర్కారు వారి పాట” అనే యాక్షన్ థ్రిల్లర్ తో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.
