Site icon NTV Telugu

Animal: అసలైన పండగ అంటే ఇదే.. మహేష్ – జక్కన ఒకే స్టేజీపై

Mahesh Rajamouli

Mahesh Rajamouli

Mahesh Babu Rajamouli as Chief guests for Animal Pre Release Event: అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో యానిమల్ అనే సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా బాబీ డియోల్, పృథ్వీరాజ్ బబ్లు కీలక పాత్రలలో నటించిన ఈ సినిమాని టి సిరీస్ బ్యానర్ మీద భూషణ్ కుమార్ భారీ బడ్జెట్ తో నిర్మించారు. సందీప్ రెడ్డి వంగా కి చెందిన భద్రకాళి పిక్చర్స్ బ్యానర్ మీద ఆయన సోదరుడు వంగా ప్రణయ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. తెలుగులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ మీద దిల్ రాజు ఈ సినిమాని పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. తెలుగులో దర్శకుడికి, రష్మిక మందనకి మంచి మార్కెట్ ఉండటంతో దాదాపు 15 కోట్ల రూపాయల వరకు వెచ్చించి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ ఒకటో తేదీన తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రిలీజ్ అయ్యేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

Leo film: రైట్స్ కొనుకున్న నిర్మాతకే నచ్చకపోతే ఎలా మాష్టారూ?

ఇక ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాదులోని మల్లారెడ్డి యూనివర్సిటీలో ఘనంగా జరగనుంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్టులుగా ఎవరు వస్తారు అని ముందు నుంచి ఆసక్తి నెలకొనగా ఈ సినిమాకి ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్య అతిథులుగా మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి హాజరు కాబోతున్నట్లుగా సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ ఇద్దరు కలిసి ఒక సినిమా చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. అలాంటి ఈ ఇద్దరు కలిసి ఒకే స్టేజి మీద కనిపించబోతూ ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మహేష్ అభిమానులైతే అసలైన పండుగ అంటే ఇదే కదా మహేష్ జక్కన్న ఒకే స్టేజి మీద కనబడితే అంతకన్నా ఇంకేం కావాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Exit mobile version