Site icon NTV Telugu

Mahesh Babu: ‘నాటు నాటు’తో బౌండరీలు దాటేసారు… నెక్స్ట్ నువ్వే మహేశ్ అన్నా

Mahesh Babu

Mahesh Babu

ఇండియన్ సినిమా గ్లోరీని ప్రపంచానికి పరిచయం చేస్తూ ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్ అవార్డుని గెలుచుకుంది. వెస్ట్రన్ గడ్డపై ఇండియన్ జెండాని ఎగరేసిన ఆర్ ఆర్ ఆర్ చిత్ర యూనిట్ ని సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రత్యేకంగా అభినందించారు. ‘నాటు నాటు పాట బౌండరీలు దాటేసింది. ఇండియాన్స్ సినిమాకి గ్రేస్ట్ మూమెంట్’ అని ట్వీట్ చేసిన మహేశ్ బాబు… కీరవాణి, చంద్రబోస్, రాజమౌళి అండ్ టీం ని కంగ్రాచ్యులేట్ చేశాడు. బెస్ట్ డాకుమెంటరీ షార్ట్ ఫిల్మ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డ్ గెలిచిన ‘ఎలిఫాంట్ విష్పర్స్’ టీంని కూడా మహేశ్ అభినందించాడు. మహేశ్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ లు మంచి స్నేహితులు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ ఆర్ ఆర్ సినిమాతో చరణ్, ఎన్టీఆర్ లు గ్లోబల్ స్టార్స్ అయిపోయారు. ఇప్పుడు రాజమౌళి నెక్స్ట్ సినిమా మహేశ్ బాబుతోనే ఉంది పైగా అది గ్లోబల్ మూవీ అని రాజమౌళి ఇప్పటికే హింట్ ఇచ్చేశాడు కాబట్టి ఈ ఇద్దరి కాంబినేషన్ లో రానున్న SSMB 29 సినిమా పాన్ వరల్డ్ ని షేక్ చేసి మహేశ్ ని కూడా గ్లోబల్ స్టార్ ని చేస్తుందేమో చూడాలి. ఆర్ ఆర్ ఆర్ సినిమా కన్నా SSMB 29 గ్రాఫ్ అండ్ బిజినెస్ తప్పకుండా ఎక్కువగా ఉంటుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ ఇయర్ ఎడింగ్ లో మహేశ్ బాబు రాజమౌళి సినిమా స్టార్ట్ అవుతుంది అనే మాట వినిపిస్తుంది. సో ఇక్కడి నుంచి మరో మూడు నాలుగేళ్ల తర్వాత SSMB 29 సినిమా ఆస్కార్ వేదికపైన నిలుస్తుందేమో చూడాలి.

 

Exit mobile version