NTV Telugu Site icon

Okkadu: మహేష్‌ను మాస్ హీరోగా నిలబెట్టిన సినిమాకి 20 ఏళ్లు

Okkadu

Okkadu

సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మహేశ్ బాబు అతి తక్కువ కాలంలోనే మంచి హీరోగా పేరు తెచ్చుకున్నాడు. లవ్, ఫ్యామిలీ డ్రామా సినిమాలు చేస్తూ ప్రేక్షకులని మెప్పిస్తున్న మహేశ్ బాబుని మాస్ కి దగ్గర చేసిన సినిమా ‘ఒక్కడు’. ‘టక్కరి దొంగ’, ‘బాబీ’ లాంటి ఫ్లాప్ అవ్వడంతో మహేశ్ ఇక మాస్ సినిమాలకి పనికి రాడు, ఫ్యామిలీ సినిమాలు చేసుకోవడమే బెటర్ అనే కామెంట్ మొదలయ్యింది. ఈ కామెంట్స్ ని పర్మనెంట్ గా సమాధి చేసిన సినిమానే ‘ఒక్కడు’. అప్పటివరకూ స్టార్ హీరోగా ఉన్న మహేశ్ బాబుని సూపర్ స్టార్ మహేశ్ బాబుగా మార్చిన ‘ఒక్కడు’ సినిమాని గుణశేఖర్ ఒక మాస్టర్ పీస్ లా తెరకెక్కించాడు. హీరో, విలన్ ట్రాక్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎపిసోడ్స్ ‘ఒక్కడు’ సినిమాలో కనిపిస్తాయి. తన 7వ సినిమాలో ‘అర్జున్’గా మహేశ్ ఎంత సూపర్బ్ గా పెర్ఫాం చేశాడో, ‘ఓబుల్ రెడ్డి’ పాత్రలో ప్రకాష్ రాజ్ అంతే అద్భుతంగా నటించి మెప్పించాడు.

అర్జున్, ఓబుల్ రెడ్డిల మధ్య సీన్స్ ఇప్పటికీ చాలా ఫ్రెష్ గా ఉంటాయి. బ్యూటిఫుల్ రైటింగ్, బెస్ట్ యాక్టింగ్ పెర్ఫార్మెన్స్ తో పాటు ‘ఒక్కడు’ మూవీకి మరో ప్రధాన బలం ‘మణిశర్మ’ సంగీతం. పాటల నుంచి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ వరకూ ప్రతి విషయంలో మణిశర్మ మ్యాజిక్ ‘ఒక్కడు’ సినిమాలో కనిపిస్తుంది. మహేశ్ కబడ్డీ ప్లేయర్ గా కనిపించిన ఈ మూవీ ఇంటర్వెల్ బ్లాక్ కి ఒక సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కొండారెడ్డి బుర్జు దగ్గర ఓబుల్ రెడ్డిని కొట్టి మహేశ్ బాబుని నిలబడితే థియేటర్స్ లో విజిల్స్ పడ్డాయి. ఇంత హై ఇచ్చిన కమర్షియల్ సినిమా అప్పట్లో మరొకటి లేదు. ‘ఒక్కడు’ మూవీ 2003 జనవరి 15న రిలీజ్ అయ్యింది, వచ్చే జనవరికి ఈ మూవీ రిలీజ్ అయ్యి 20 ఏళ్లు అవుతుండడంతో ‘ఒక్కడు’ రీరిలీజ్ కి రంగం సిద్ధమవుతోంది. జనవరి 7న ‘ఒక్కడు’ స్పెషల్ షోస్ కి ప్లాన్ చేస్తున్నారు. ‘పోకిరి’ రీరిలీజ్ తో కొత్త ట్రెండ్ ని క్రియేట్ చేసిన మహేశ్ ఫాన్స్, ఈసారి ‘ఒక్కడు’ లాంటి బెంచ్ మార్క్ మూవీతో ఎలాంటి రికార్డులు నమోదు చేస్తారో చూడాలి.

Show comments