Site icon NTV Telugu

Okkadu: ట్రైలర్ కట్ అదిరింది… ఘట్టమనేని అభిమానులకి జాతరే

Okkadu

Okkadu

సూపర్ స్టార్ మహేశ్ బాబుని మాస్ హీరోగా మార్చిన ‘ఒక్కడు’ సినిమా రీరిలీజ్ కి రంగం సిద్ధమయ్యింది. ఈ సినిమా రిలీజ్ అయ్యి 2023  జనవరి 15కి ఇరవై ఏళ్లు అవుతున్న సంధర్భంగా, మేకర్స్ ‘ఒక్కడు’ సినిమాని రీరిలీజ్ చెయ్యడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. 2023 జనవరి 7న ఒక్కడు సినిమాని ప్రపంచవ్యాప్తంగా రీరిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేసిన మేకర్స్, ఈ మూవీ కొత్త ట్రైలర్ ని బయటకి వదిలారు. ఆడియోని బూస్ట్ చేసి, విజువల్ ని 4కి మార్చి కట్ చేసిన రెండు నిమిషాల ట్రైలర్ సూపర్బ్ గా ఉంది. మహేశ్ బాబుకి సంబంధించిన కట్ షాట్స్ ఆకట్టుకున్నాయి. భూమిక చావ్లా హీరోయిన్ గా నటించిన ఈ మూవీని గుణశేఖర్ తెరకెక్కించాడు. స్పోర్ట్స్ మరియు ఫ్యాక్షన్ జానర్ లని మిక్స్ చేసి ఇండస్ట్రీ హిట్ కొట్టిన గుణశేఖర్, ‘ఒక్కడు’ రీరిలీజ్ గురించి ఒక్క కామెంట్ కూడా చెయ్యకపోవడం విశేషం.

Read Also: Okkadu: మహేష్‌ను మాస్ హీరోగా నిలబెట్టిన సినిమాకి 20 ఏళ్లు

ఇదిలా ఉంటే ‘ఒక్కడు’ సినిమాకి పోటీగా, ఒక్కడు సినిమా రిలీజ్ అవ్వడానికన్నా వారం ముందే పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషి’ సినిమా ఆడియన్స్ ముందుకి రానుంది. పవన్ కళ్యాణ్ కి స్టార్ హీరో స్టేటస్ ఇచ్చిన ఈ మూవీ డిసెంబర్ 31న ప్రేక్షకుల ముందుకి రానుంది. ‘పోకిరి’, ‘జల్సా’ సినిమాలతో ఫాన్స్ షోకి కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసిన ‘పవన్ కళ్యాణ్’, ‘మహేశ్ బాబు’ ఫాన్స్ ఈసారి రీరిలీజ్ విషయంలో పోటి పడనున్నారు. మరి డిసెంబర్ 31న పవన్ కళ్యాణ్ ఫాన్స్ ‘ఖుషి’ సినిమాతో సెట్ చెయ్యబోయే టార్గెట్ ని, జనవరి 7న ఘట్టమనేని అభిమానులు బ్రేక్ చేస్తారో లేదో చూడాలి. ఈ రెండు బెంచ్ మార్క్ సినిమాల్లోనూ హీరోయిన్ గా భూమికనే కావడం, రెండు సినిమాలకి మణిశర్మనే మ్యూజిక్ డైరెక్ట్ కావడం విశేషం.

Read Also: Okkadu: ఘట్టమనేని అభిమానులు మాస్ జాతరకి రెడీ అవ్వండి

https://www.youtube.com/watch?v=iRF6BPXj7uA

Exit mobile version