NTV Telugu Site icon

Mahesh babu : పసి పిల్లల హృదయాలలో దేవుడిగా నిలిచిన సూపర్ స్టార్

Fd3e16b1 B5ba 4018 A1bf 7f8574aa3f4d

Fd3e16b1 B5ba 4018 A1bf 7f8574aa3f4d

రేపు సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు… కృష్ణ గారు భౌతికంగా మరణించినా కూడా తాను నటించిన సినిమాల ద్వారా అభిమానుల హృదయాల్లో ఎప్పటికి జీవించి ఉన్నారు.సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ ను కృష్ణ పుట్టినరోజున ప్రకటించడానికి ఆసక్తి చూపుతారనే విషయం తెలిసిందే. మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీకి సంబంధించిన అప్ డేట్స్ రేపు విడుదల కానున్నాయి.మహేష్ కోసం త్రివిక్రమ్ గుంటూరు కారం అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేశారని సమాచారం.ఈ టైటిల్ నే అధికారికంగా ప్రకటిస్తారని తెలుస్తుంది.మహేష్ అభిమానులు కూడా ఈ టైటిల్ పవర్ ఫుల్ గా ఉందని చెబుతున్నారు. అయితే ఒకవైపు సినిమాలు, ఇతర కార్యక్రమాలతో ఎంత బిజీగా ఉన్నా మహేష్ బాబు తన సేవా కార్యక్రమాలను మాత్రం కొనసాగిస్తుండటం విశేషం.

అయితే మహేష్ బాబు రెండేళ్ల చిన్నారి ప్రాణాలను కాపాడారు. మహేష్ బాబు ఫౌండేషన్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వయస్సు పెరుగుతున్నా కూడా మరింత అందంగా కనిపిస్తున్న మహేష్ బాబు తను చేస్తున్న సేవా కార్యక్రమాల ద్వారా తన స్థాయిని కూడా అంతే పెంచుకుంటున్నారు. రెండు సంవత్సరాల వయస్సు ఉన్న బాలుడికి మహేష్ బాబు తాజాగా హార్ట్ సర్జరీ చేయించడం గమనార్హం.రెండేళ్ల వయస్సు ఉన్న అమలాపురంకు చెందిన కార్తికేయ అనే బాలుడు గుండెలో రంధ్రం ఉండటంతో ఆరోగ్య సమస్యలతో బాధ పడుతుండగా ఈ సంగతి మహేష్ బాబు ఫౌండేషన్ దృష్టికి వచ్చింది. మహేష్ చేసిన సహాయానికి బాలుడి తల్లీదండ్రులు ఎన్నో కృతజ్ఞతలు చెప్పారు. ఆంధ్రా హాస్పిటల్స్ ద్వారా మహేష్ బాబు ఫౌండేషన్ బాలుడికి చికిత్స చేయించింది. ప్రస్తుతం బాలుడు ఆరోగ్యంగానే ఉన్నాడని సమాచారం.. మహేష్ బాబు ఫౌండేషన్ కష్టాల్లో ఉన్న పసి పిల్లల హృదయలలో దేవుడిగా నిలిచాడు.