Mahesh Babu buys Range Rover car worth 5.4 crores: తెలుగు సినీ నటుడు మహేష్ బాబు క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన సూపర్ స్టార్ కృష్ణ కుమారుడిగా హీరో అయినా ఆ తరువాత తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించారు.ఈమధ్యనే త్రివిక్రమ్ తో చేస్తున్న గుంటూరు కారం సినిమా షూటింగ్ లో జాయిన్ అయిన ఆయన ఒక ఖరీదైన కారు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఆయన ఒక సరికొత్త రేంజ్ రోవర్ కారు కొనుగోలు చేశారని దాని ధర ఏకంగా 5.4 కోట్లు అని తెలుస్తోంది. మహేష్ బాబు కారుకు మరో ప్రత్యేకత కూడా ఉందని అంటున్నారు. అదేమంటే ఆయన కారు బంగారు వర్ణంలో ఉంది. హైదరాబాద్‌లో అద్భుతమైన బంగారు రంగుతో ఉన్న ఏకైక రేంజ్ రోవర్ ఇదేనని తెలుస్తోంది.
Rashmi Gautam: హాట్ అందాలతో మతి పోగొడుతున్న రష్మీ..
ఇక ఈ ప్రత్యేక మోడల్ ప్రస్తుతం భారతదేశంలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న అత్యంత ఖరీదైన కార్లలో ఒకటిగా నిలుస్తోంది. నిజానికి మహేష్ బాబుకు అంతకు ముందే రోల్స్ రాయిస్ ఘోస్ట్, రేంజ్ రోవర్ వోగ్, ఆడి ఎ7, బిఎమ్‌డబ్ల్యూ 7 సిరీస్, మెర్సిడెస్ బెంజ్ ఎస్-క్లాస్ వంటి విలాసవంతమైన కార్లు ఉన్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే 12 ఏళ్ల గ్యాప్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా ఒక ప్రాజెక్ట్ సిద్దమవుతోంది. గుంటూరు కారం పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా మహేష్ కెరియర్లో 28వ సినిమా కాగా శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను హారికా హాసిని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద ఎస్ చినబాబు, ఎస్ నాగ వంశీ నిర్మిస్తున్నారు.
Mahesh New Range Rover
