సూపర్ స్టార్ మహేష్ బాబు ఇప్పటికీ చాలామంది యువతుల మనసుల్లో యువరాజే. అయితే ఈ హీరో మాత్రం తన మనసులో నమ్రతా శిరోద్కర్ కు గుడి కట్టేశారు. ఈ అందమైన జంట 17వ వివాహ వార్షికోత్సవం నేడు. ఈ సందర్భంగా మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి ఉన్న ఓ అద్భుతమైన పిక్ ను షేర్ చేసుకుంటూ “ఇంత ఈజీగా17… NSG హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ… ఇలాంటి రోజులు మనకు మరిన్ని రావాలి” అంటూ నమ్రతపై ప్రేమను కురిపించారు.
Tollywood : సీఎంతో భేటీపై ఉత్కంఠ… విజయవాడలో స్టార్స్
మరోవైపు నమ్రత మాత్రం ఓ సర్పైజ్ పిక్ తో భర్తను రొమాంటిక్ గా విష్ చేసింది. తన వివాహ జీవితంలోని కొన్ని క్షణాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ అందమైన జీవితానికి మహేష్‌కు ధన్యవాదాలు తెలిపింది. సాధారణంగా ఫ్యామిలీతోనే ఎక్కువగా కనిపించే ఈ జంట తాజాగా రొమాంటిక్ గా ఉన్న పిక్ లో కన్పించడం హాట్ టాపిక్ అయ్యింది. నమ్రత మొట్టమొదటిసారి మహేష్ లోని రొమాంటిక్ యాంగిల్ ను బయటపెడుతూ సూపర్ స్టార్ తనను కిస్ చేస్తున్న పిక్ ను షేర్ చేసింది. దీంతో ఈ పిక్ ఇప్పుడు ఇంటర్నెట్ కు షేక్ చేస్తోంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్ 2005 ఫిబ్రవరి 10న పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు పిల్లలు గౌతమ్, సితార. మహేష్ తో పెళ్ళైన తరువాత నమ్రత సినిమా కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టేసి, తన కుటుంబాన్ని చూసుకోవాలని నిర్ణయించుకుంది. మహేష్ కూడా తన కుటుంబంతో గడపడానికి ఎక్కువగా టైం కేటాయిస్తూ ఉంటారు. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా మహేష్ మాత్రం ఫ్యామిలీతో తరచుగా వెకేషన్లకు వెళ్తూ సరదాగా గడుపుతారన్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం మహేష్ బాబు “సర్కారు వారి పాట” సినిమాతో బిజీగా ఉన్నారు.
