శర్వానంద్, సిద్ధార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఇంటెన్స్ రొమాంటిక్ యాక్షన్ డ్రామా “మహా సముద్రం”. తాజాగా సినిమా నిర్మాతలు ఈ చిత్రం అక్టోబర్ 14న దసరా పండుగ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు ప్రకటించారు. విడుదల తేదీని ప్రకటిస్తూ శర్వా, సిద్ధార్థ్ ఒకరిపై ఒకరు తుపాకులు గురిపెట్టిన పోస్టర్ ను విడుదల చేశారు. ఆర్ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి “మహా సముద్రం” మూవీకి దర్శకత్వం వహిస్తున్నారు.
Read also : ఢిల్లీ సీఎంతో సోనూసూద్ భేటీ… కీలక నిర్ణయం
ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్లు, అప్డేట్స్ పాజిటివ్ బజ్‌ను పెంచేశాయి. పండుగ సీజన్ ఈ సినిమాకు బాగా కలిసొస్తుందని చెప్పొచ్చు. ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. చైతన్ భరద్వాసంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి “హే రంభ” సాంగ్ పెద్ద హిట్ అయింది.
