Site icon NTV Telugu

Mahar Yodh 1818: ‘కోరేగావ్ యుద్ధం’పై సినిమా.. ఫాంటసీ థ్రిల్లర్ గా!

Mahar Yodh Movie

Mahar Yodh Movie

Mahar Yodh 1818 Movie Opening: తెలుగు సినిమాలలో ప్రేక్షకులు ఎప్పుడూ వైవిధ్యం కోరుకుంటారన్న సంగతి తెలిసిందే. సినిమాలో కంటెంట్ బాగుంటే అది చిన్నా-పెద్దా సినిమా అనేది తేడా చూపకుండా ఆ సినిమాను నెత్తిన పెట్టుకునే అభిమానం సినీ ప్రేమికులకు సొంతం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ నేపథ్యంలో సినిమాపై ఉన్న ఇష్టంతో సృజనకు పదును పెట్టి, సాంకేతికతను జోడించి, అత్యుత్తమ నిర్మాణ విలువలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేందుకు సిద్దమయ్యారు ఔత్సాహికులైన దర్శక, నిర్మాతలు. ఈ క్రమంలోనే ప్రేక్షకులు ఎప్పుడూ చూడని ఓ కొత్త జోనర్లో సరికొత్త సినిమాకు శ్రీకారం చుట్టారు. మాయ పేటిక, శ్రీవల్లి వంటి పలు చిత్రాల్లో నటించిన యువ ఛార్మింగ్ హీరో రజత్ రాఘవ్, ముంబయ్ భామ ఐశ్వర్య రాజ్ బకుని హీరోయిన్స్ గా ఒక సినిమా మొదలైంది. డి.ఎస్.ఆర్ ఫిలిమ్స్ బ్యానర్ పై రాజు గుడి గుంట్ల దర్శకత్వంలో సువర్ణ రాజు దాసరి నిర్మిస్తున్న సోషల్ థ్రిల్లర్, యాక్షన్- ఫాంటసీ చిత్రం “మహర్ యోధ్ 1818”. ఈ సినిమా పూజా కార్యక్రమాలు భద్రకాళి పీఠం పీఠాదీశ్వరి శ్రీ శ్రీ శ్రీ డాక్టర్ సింధు మాతాజీ ఆధ్వర్యంలో జరిగాయి. హైదరాబాద్ లోని సారధి స్టూడియోస్ లో అక్టోబర్ 26 న షూటింగ్ ఘనంగా ప్రారంభం అయింది.

iPhone 15 Loot: ఐఫోన్ 15 ధరలో భారీ డ్రాప్.. ఏకంగా 39,150 తగ్గింపు.. !

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన ఏపియస్సి సెల్ కమిషనర్ విక్టర్ ప్రసాద్ హీరో, హీరోయిన్ లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేయగా దర్శకుడు నక్కిన త్రినాథరావు గౌరవ దర్శకత్వం వహించారు. మహా-శశాంక్ ద్వయం సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి వెంకట్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించారు. జనవరి 1, 1818న, బ్రిటీష్ సైన్యం భీమా-కోరేగావ్‌లో పీష్వా బాజీరావ్ II యొక్క 28,000 మంది సైనికులను ఓడించింది. బ్రిటీష్ సైన్యంలోని చాలా మంది సైనికులు మహర్ కమ్యూనిటీకి చెందిన వారు కావడంతో వారిని మహర్ యోధులు అని పిలుస్తారు. 800 మంది సైనికులతో కూడిన బ్రిటిష్ సైన్యంలో సుమారు 500 మంది మహర్ కమ్యూనిటీకి చెందిన సైనికులు ఉన్నారు. వారు 28,000 మంది సైనికులను ఓడించారని చరిత్ర చెబుతోంది. బహుశా టైటిల్ ను బట్టి చూస్తే అది ఈ యుద్ధం మీదనే తెరకెక్కిస్తున్నారని అర్ధం అవుతోంది.

Exit mobile version