Site icon NTV Telugu

పెళ్లి సందD : ‘మధుర నగరిలో’ లిరికల్ సాంగ్

Madhura Nagarilo Lyrical from Pelli SandaD

టాలీవుడ్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ మేకా తన తొలి సినిమా ‘నిర్మలా కాన్వెంట్‌’లో తన యాక్టింగ్ స్కిల్స్‌తో ఇప్పటికే సినీ ప్రేమికులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు ‘పెళ్లి సందD’ అనే రొమాంటిక్ మూవీతో రాబోతున్నాడు. ప్రముఖ తెలుగు చిత్రనిర్మాత కె. రాఘవేంద్రరావు రోషన్ చిత్రంలో తొలిసారిగా నటిస్తున్నారు. ఈ సినిమాకు లెజెండ్ రాఘవేంద్రరావు పర్యవేక్షణలో నూతన దర్శకురాలు గౌరీ రోనంకి దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్, ఆర్కా మీడియా వర్క్స్ సహకారంతో శోభు యార్లగడ్డ, మాధవి కోవెలమూడి, ప్రసాద్ దేవినేని సంయుక్తంగా నిర్మించారు. శ్రీ లీలా హీరోయిన్‌గా నటిస్తోంది.

Read Also : “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” ట్రైలర్ కు ముహూర్తం ఖరారు

ప్రస్తుతం ‘పెళ్లి సందD’ మేకర్స్ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.సెప్టెంబర్ 22 న ‘పెళ్లి సందD’ ట్రైలర్‌ను విడుదల చేయగా, ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో షకలక్ శంకర్, శ్రీనివాస్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, రావు రమేష్, రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, ఫిష్ వెంకట్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ రోజు ఉదయం మాస్ మహారాజా రవితేజ ‘పెళ్లి సందD’ నుంచి ‘మధుర నగరిలో’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ‘మధుర నగరిలో’ అనే పాటకు శ్రీనిధి, నయన నాయర్, కాల భైరావ గాత్రం అందించగా, చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు.

Exit mobile version