“మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” ట్రైలర్ కు ముహూర్తం ఖరారు

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”. ఈ సినిమాకు దసరా కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” ట్రైలర్ రిలీజ్ కు ముహూర్తం ఖరారు చేశారు. సెప్టెంబర్ 30న సాయంత్రం 6.10 గంటలకు ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేయనున్నట్టు ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అందులో అఖిల్ ను పూజా హెగ్డే వెనక నుంచి ఎమోషనల్ గా హాగ్ చేసుకోవడం కన్పిస్తోంది. టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. దీంతో ఇప్పుడు ట్రైలర్ పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మరి ట్రైలర్ ఎలా ఉంటుందో చూడాలి.

Read Also : ఆకట్టుకుంటున్న ‘పుష్ప’రాజ్ లవర్ శ్రీవల్లి లుక్

ఈ సినిమా అక్టోబర్ 15న విడుదలకు సిద్ధమైంది. బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జిఎ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్, వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో అఖిల్ హర్ష అనే ఎన్ఆర్ఐ పాత్రలో, పూజా హెగ్డే మాత్రం విభా అనే స్టాండర్డ్ కమెడియన్ పాత్రలో నటించబోతోంది. ఈషా రెబ్బ, మురళి శర్మ, వెన్నెల కిషోర్, జయప్రకాష్, ప్రగతి, ఆమని లాంటి నటీనటులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు.

-Advertisement-"మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్" ట్రైలర్ కు ముహూర్తం ఖరారు

Related Articles

Latest Articles