Nana Patekar Slap Incident : నానాపటేకర్ గారు నన్ను చెంపదెబ్బ కొట్టింది నిజమే.! ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్

Nana Patekar (2)

Nana Patekar (2)

Nana Patekar Slap Incident : సినిమాల్లో మనం చూసే కొన్ని ఎమోషన్స్ నిజంగా నటనతో వచ్చాయా? లేక ఆ క్షణంలో నటులు నిజంగానే ఆ ఎమోషన్స్ ను పండిస్తారా ? అనే ప్రశ్నలు మన మెదడులో తొలుస్తూ ఉంటాయి. అయితే ఈ ప్రశ్నలకు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చారు ప్రముఖ నటి మధు షా. దశాబ్దాలుగా భారతీయ సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆమె, ఒకప్పుడు ప్రముఖ నటుడు నానా పటేకర్‌తో కలిసి పనిచేసిన సమయంలో జరిగిన ఆశ్చర్యకరమైన సంఘటనను తాజాగా గుర్తుచేసుకున్నారు. ఆ సంఘటన తన నటనా జీవితాన్ని పూర్తిగా మార్చేసిందని కూడా వెల్లడించారు.

‘ఫూల్ ఔర్ కాంటే’, ‘రోజా’, ‘జెంటిల్‌మన్’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్న మధు షా ఇటీవల ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా 1997లో విడుదలైన ‘యశ్వంత్’ చిత్ర షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటనను వివరించారు. ఆ సినిమాలో ఆమె నానా పటేకర్‌తో కలిసి కీలక పాత్రలో నటించారు. అదే సినిమా సమయంలో తాను మెథడ్ యాక్టింగ్ అసలు అర్థం ఏమిటో తెలుసుకున్నానని చెప్పారు.

×
×
Ad

ఒక ఎమోషన్ సన్నివేశం కోసం ఇద్దరూ షూటింగ్‌కు సిద్ధమయ్యారని, ఆ సీన్‌లో కన్నీళ్లు రావాల్సి ఉండటంతో గ్లిజరిన్ ఉపయోగించాలని అనుకున్నారని మధు తెలిపారు. అయితే నానా పటేకర్ మాత్రం గ్లిజరిన్ అవసరం లేదని, ఎమోషన్ ని అనుభవిస్తే సహజంగానే కన్నీళ్లు వస్తాయని సూచించారట. అయితే ఆ క్షణంలో తనకు కన్నీళ్ళు రావాల్సిన ఎమోషన్ రాకపోవడంతో సీన్ ఆశించిన విధంగా ముందుకు సాగలేదని ఆమె గుర్తుచేసుకున్నారు.

అప్పుడు అనూహ్యంగా జరిగిన ఒక చర్య అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిందని ఆమె చెప్పుకొచ్చారు. రిహార్సల్స్‌లో ఎప్పుడూ చేయని విధంగా నానా పటేకర్ ఒక్కసారిగా తనను నిజంగానే చెంపదెబ్బ కొట్టారని మధు తెలిపారు. ఆ సంఘటనతో తాను తీవ్రంగా షాక్‌కు గురయ్యానని, అంతేకాదు చాలా కోపం కూడా వచ్చిందని చెప్పారు. ఆ సమయంలో తాను కూడా నానా పటేకర్‌కు తిరిగి చెంపదెబ్బ కొట్టానని వెల్లడించారు.

ఆ సన్నివేశంలో ఇద్దరి మధ్య జరిగినది పూర్తిగా సహజమైనవి కావడంతో, తెరపై కనిపించిన ఎమోషన్ కూడా రియాలిటీగా నిలిచాయని ఆమె వివరించారు. ఆ సీన్ పూర్తయ్యాక ఆ రోజు షూటింగ్ కూడా ముగిసిపోయిందని చెప్పారు. అయితే ఆ సంఘటన తనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిందని మధు అభిప్రాయపడ్డారు. నటన అంటే డైలాగులు చెప్పడం కాదని, పాత్రలో పూర్తిగా లీనమవ్వడం కూడా అంతే ముఖ్యమని అప్పుడే అర్థమైందన్నారు.

నానా పటేకర్ భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత సహజ నటనకు పేరుగాంచిన నటుల్లో ఒకరుగా గుర్తింపు పొందారు. పాత్ర కోసం పూర్తిగా మారిపోవడం, ఎమోషన్స్ ను రియాలిటీగా పండించడం ఆయన ప్రత్యేకతగా చెబుతారు. అలాంటి నటుడితో కలిసి పనిచేసిన అనుభవం తనకు ఎంతో నేర్పిందని మధు షా తెలిపారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత కూడా ‘యశ్వంత్’ షూటింగ్‌లో జరిగిన ఆ సంఘటనను గుర్తుచేసుకుంటూ, తన నటనా జీవితంలో అది మరచిపోలేని అనుభవంగా నిలిచిపోయిందని ఆమె వెల్లడించారు.