Site icon NTV Telugu

Macharla NiyojakaVargam: ఆ వయస్సులో తప్పు చేయడం తప్పు కాదంటున్న నితిన్

Nithin

Nithin

టాలీవుడ్ హీరో నితిన్, కృతిశెట్టి  జంటగా  ఎంఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం “మాచర్ల నియోజకవర్గం”. రాజ్ కుమార్ ఆకెళ్ళ సమర్పణలో శ్రేష్ట్ మూవీస్ మరియు ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్మెంట్స్‌పై సుధాకర్ రెడ్డి మరియు నిఖితా రెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, వీడియోస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా నుంచి మొదటి లిరికల్ వీడియోను  విశ్వనటుడు కమల్ హాసన్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు.  “చిల్ మారో చిల్ మారో”  అంటూ సాగుతున్న ఈ పాట ఆద్యంతం ఆకట్టుకొంటుంది.

మంచి పార్టీ మోడ్ లో  నితిన్ చిల్ అవుతున్నట్లు కనిపించాడు. ఇక నితిన్ తో పాటు ఈ సాంగ్ లో క్యాథరిన్ చిందేసింది. మహతి స్వర సాగర్ సంగీతం అందించిన ఈ సాంగ్ కు కృష చైతన్య క్యాచీ లిరిక్స్ అందించగా.. నకేష్ అజీజ్, సంజన కల్మంజే ఎంతో హుషారుగా ఆలపించారు. లిరిక్స్ ను బట్టి  హీరో క్యారెక్టర్ ను తెలిపే సాంగ్ లా కనిపిస్తుంది. ఈ చిన్న వయస్సులో తప్పు కాదులే తప్పు చేయడం.. వేళకాని వేళ ఎందుకంత మోయడం అంటూ  సాగిన ఈ సాంగ్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ చిత్రంలో నితిన్ కలెక్టర్ సిద్దార్థ్ రెడ్డి గా నటిస్తున్న విషయం విదితమే. ఇక ఈ సినిమా ఆగస్టు 12 న రిలీజ్ కానుంది. వరుస ప్లాపుల మధ్య ఉన్న నితిన్ కు ఈ సినిమా ఎలాంటి విజయాన్నీ అందిస్తుందో చూడాలి.

Exit mobile version