NTV Telugu Site icon

Hrithik Roshan: రిప్లై లేట్ అయ్యింది కానీ అదిరిపోయింది…

Hrithik

Hrithik

వార్ సినిమాకి సీక్వెల్ గా, యష్ రాజ్ స్పై యాక్షన్ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న సినిమా వార్ 2. యంగ్ టైగర్ ఎన్టీఆర్, గ్రీక్ గాడ్ హ్రితిక్ రోషన్ కలిసి నటించనున్న ఈ సినిమాని అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఎక్స్టెన్సివ్ ప్రీప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసుకున్న వార్ 2 రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. మొదటి షెడ్యూల్ స్పెయిన్ లో జరగ్గా… ఇందులో ఎన్టీఆర్ హ్రితిక్ రోషన్ లేని సీన్స్ ని షూట్ చేసారు. తర్వాతి షెడ్యూల్ లో హ్రితిక్ జాయిన్ అయ్యాడు కానీ ఎన్టీఆర్ దేవర షూటింగ్ పార్ట్ కంప్లీట్ అవ్వగానే జాయిన్ అవ్వనున్నాడు. ఫిబ్రవరి నెల నుంచి ఎన్టీఆర్ వార్ 2లో హ్రితిక్ రోషన్ తో తలపడనున్నాడు. త్వరలో ఎన్టీఆర్-హ్రితిక్ కలిసిన ఫోటో బయటకి వస్తుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ఆ వెయిటింగ్ ఎండ్ కార్డ్ త్వరలోనే పడనుందని బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇదిలా ఉంటే జనవరి 10న హ్రితిక్ రోషన్ బర్త్ డే కావడంతో ఎన్టీఆర్ బర్త్ డే విషెష్ చెప్తూ ట్వీట్ చేసాడు. “బిగ్ చీర్స్ ఫర్ ఫైటర్” అంటూ ఎన్టీఆర్ చేసిన ట్వీట్ కి హ్రితిక్ రోషన్ కాస్త లేట్ గా రిప్లై ఇచ్చాడు కానీ సీ యు సూన్ అంటూ కిక్ ఇచ్చాడు. “థాంక్యూ సో మచ్ తారక్… దేవర గ్లిమ్ప్స్ నచ్చింది. గుడ్ లుక్… సీ యు సూన్” అంటూ హ్రితిక్ రోషన్ రిప్లై ఇచ్చాడు. ఇందులో చివరి మాటలు మాత్రమే సినీ అభిమానులని అట్రాక్ట్ చేసాయి. దీంతో వార్ 2 ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. మరి ఈ ఇద్దరు యాక్టింగ్ లెజెండ్స్ ఎప్పుడు కలిసి కనిపిస్తారో చూడాలి.