Site icon NTV Telugu

అఫిషియల్ : “లవ్ స్టోరీ” రిలీజ్ డేట్ వచ్చేసింది !

Love Story in Theatres from 10th September

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటిస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ “లవ్ స్టోరీ”. శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్, రామ్ మోహన్ రావు నిర్మించారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 16న థియేటర్లలో సందడి చేయాల్సింది. కానీ కరోనా, లాక్ డౌన్ కారణంగా ఈ లవ్ స్టోరీ విడుదల వాయిదా పడింది. ప్రేక్షకులు ఈ సినిమా విడుదల గురించి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.

Read Also : యమ్మీ… నోరూరిస్తున్న రకుల్ !

ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ అవుతుందంటూ వార్తలు వచ్చాయి. ఆ తరువాత “లవ్ స్టోరీ థియేటర్లలోనే అని, సెప్టెంబర్ 10న “లవ్ స్టోరీ”ని ప్రేక్షకుల ముందుకు తీసుకున్నారని వార్తలు వచ్చాయి. ఆ వార్తలను నిజం చేస్తూ తాజాగా అధికారిక ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రం సెప్టెంబర్ 10 న విడుదల అవుతుందంటూ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సినిమా పాటలు పెద్ద హిట్ అయ్యాయి. లీడ్ పెయిర్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా ఆకట్టుకుంది.మేకర్స్ త్వరలో సినిమా ప్రమోషన్లను ప్రారంభిస్తారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్ తేదీని కూడా ప్రకటిస్తారు.

Exit mobile version