యమ్మీ… నోరూరిస్తున్న రకుల్ !

“వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్”తో 2013లో తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టింది పంజాబీ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. అప్పటి నుండి ఆమె టాలీవుడ్‌లోనే కాకుండా అనేక ఇతర ఫిల్మ్ ఇండస్ట్రీలలో కూడా బిజీ అయిపోయింది. రకుల్ ప్రీత్ ఇప్పుడు బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు వరుస సినిమాలతో బిజీగా ఉన్న నటీమణులలో ఒకరు.రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఆమె వ్యక్తిగత, ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను పంచుకుంటూ ఉంటుంది. తాజా పోస్ట్‌లో రకుల్ ఫుడ్ పట్ల తనకు ఉన్న ప్రేమను చాటుకుంది. ఈ బ్యూటీ వివిధ రకాల డిజర్ట్‌లతో పాటు కొన్ని ఆహారపదార్థాలను తింటున్న ఫొటోలన్నీ ఒకేచోట చేర్చిన వీడియోను షేర్ చేసింది.ఈ వీడియో నెటిజన్లకు నోరూరిస్తోంది.

Read Also : మరో మూవీకి లేడీ సూపర్ స్టార్ గ్రీన్ సిగ్నల్ ?

రకుల్ ప్రీత్ సింగ్ చివరిసారిగా నితిన్ నటించిన చెక్ (2021) సినిమాలో కనిపించింది. ఆమె నెక్స్ట్ క్రిష్, వైష్ణవ్ తేజ్ మూవీలో కనిపించనుంది. తమిళంలో శివకార్తికేయన్ సరసన “అయలాన్”, కమల్ హాసన్‌తో కలిసి “ఇండియన్ 2” చిత్రాలలో నటిస్తోంది. రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం అజయ్ దేవగన్, అమితాబ్ బచ్చన్, సిద్ధార్థ్ మల్హోత్రా తో “థాంక్ గాడ్‌”, “మేడే”తో సహా మరో మూడు బాలీవుడ్ ప్రాజెక్ట్‌లను లైన్లో పెట్టింది. ఆమె జాన్ అబ్రహం సరసన “అటాక్” అనే సినిమాలో కూడా నటిస్తోంది.

View this post on Instagram

A post shared by Rakul Singh (@rakulpreet)

Related Articles

Latest Articles