Dhanush: ఈ ఏడాది ధనుష్ కు సార్ తో మంచి హిట్ వచ్చింది. తెలుగులో డైరెక్ట్ ఎంట్రీ ఇచ్చి డీసెంట్ హిట్ తో అందరిని అలరించాడు. ఇక ఈ సినిమా తరువాత ధనుష్ లైనప్ మతిపోగోట్టేస్తోంది. ఇక ప్రస్తుతం ధనుష్ లైనప్ లో అభిమానులు ఎక్కువ అంచనాలు పెట్టుకున్న సినిమాల్లో కెప్టెన్ మిల్లర్ ఒకటి. అరుణ్ మథేశ్వరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, కోలీవుడ్ భామ ప్రియాంక అరుల్ మోహన్, సందీప్ కిషన్, నివేదితా సతీష్, అమెరికన్ యాక్టర్ ఆర్ఆర్ఆర్ ఫేం ఎడ్వర్ట్ సొన్నెన్ బ్లిక్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఏ అప్డేట్ వచ్చినా అభిమానులు నెట్టింట వైరల్ చేస్తున్నారు.
PVT04: వజ్ర కాళేశ్వరి దేవిగా అపర్ణా దాస్!
ఇక తాజాగా ఈ సినిమా నుంచి బిగ్ అప్డేట్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. కెప్టెన్ మిల్లర్ ప్రీ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. అంతే కాకుండా.. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ ఎప్పుడు వస్తుందో చెప్పుకొచ్చారు.ఫస్ట్ లుక్ జూన్ లో, టీజర్ జూలైలో రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ ప్రీ లుక్ కూడా అదిరిపోయింది. ధనుష్ కిల్లర్ లా చూపించారు. గన్ పట్టుకొని నడుస్తున్న ధనుష్ బ్యాక్ ను చూపించారు. ఇక ఈ ప్రీ లుక్ సైతం నెట్టింట వైరల్ గా మారింది. ఈ సినిమాను ఈ ఏడాదిలోనే రిలీజ్ చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఇక జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా తెలుగు తమిళ హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. మరి ఈ చిత్రం ధనుష్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.