ప్రముఖ కథానాయకుడు దుల్కర్ సల్మాన్ కి చెందిన వేఫేరర్ ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ నిర్మించిన ‘కొత్త లోక చాఫ్టర్ట్ 1’. ఈ చిత్రానికి డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించాడు. సూపర్ హీరోయిన్ చంద్రగా కళ్యాణి ప్రియదర్శన్ నటించిన ఈ సినిమా కొత్త లోక సినిమాటిక్ యూనివర్స్ లోని మొదటి సినిమాగా వచ్చింది. భారతీయ సినిమాలో సూపర్ హీరో తరహా చిత్రాలు రావడమే తక్కువే. అలాంటిది భారతదేశపు మొట్టమొదటి మహిళా సూపర్ హీరో చిత్రంగా ‘కొత్త లోక చాఫ్టర్ 1’ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.
ఓనం కానుకగా రిలీజ్ అయిన కొత్త లోక అదరగొడుతుంది. తొలి రోజు తోలి ఆట నుండి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక కళ్యాణి ప్రియదర్శని నటన కెరీర్ బెస్ట్ అనే పేర్కొన్నారు ప్రేక్షకులు. అటు కలెక్షన్స్ పరంగాను కొత్త లోక వసూళ్ల వర్షం కురిపిస్తోంది. రిలీజ్ అయినా తోలి మూడు రోజులకు గాను రూ. 42 కోట్ల గ్రాస్ రాబట్టింది లోక. ఇక బుకింగ్స్ పరంగాను 1.16 M టికెట్స్ బుకింగ్స్ తో దూసుకెళ్తోంది. ఓనం కానుకాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన హృదయపూర్వం కూడా రిలీజ్ అయింది. ఆ సినిమా కూడా హిట్ టాక్ తెచ్చుకుంది. కానీ మోహన్ లాల్ సినిమాను మించి కొత్త లోక వసూళ్లు రాబట్టి సెన్సషన్ క్రియేట్ చేస్తుంది. ఆదివారం రాత్రి కేరళ వ్యాప్తంగా 300 షోస్ కు పైగా యాడ్ చేసారంటే అర్ధం చేసుకోవచ్చు కొత్త లోక డిమాండ్ ఎలా ఉందొ. తెలుగులోను కొత్త లోక రూ. 1.42 కోట్ల గ్రాస్ రాబట్టి సూపర్ హిట్ దిశగా వెళుతోంది.
