NTV Telugu Site icon

Local Boi Nani: గోల్డెన్ ఛాన్స్ మిస్ చేసుకున్న యూట్యూబర్ లోకల్ బాయ్ నాని.. దెబ్బకి దశ తిరిగుండేది!

Local Boi Nani

Local Boi Nani

Local Boi Nani missed a golden chance in daya web series: జేడీ చక్రవర్తి తెలుగులో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన దయ వెబ్ సిరీస్ ప్రస్తుతానికి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతున్న సంగతి తెలిసిందే. పవన్ సాధినేని డైరెక్ట్ చేసిన ఈ వెబ్ సిరీస్ లో జేడీ చక్రవర్తి సరసన ఈషా రెబ్బా, రమ్యానంబీశన్, జోష్ రవి, పృథ్వి వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ మధ్యకాలంలో తెలుగులో వచ్చిన వెబ్ సిరీస్ లన్నిటిలో ఈ వెబ్ సిరీస్ భిన్నంగా ఉందని ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వెబ్ సిరీస్ డైరెక్టర్ పవన్ సాధినేని తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ లో జోష్ రవి పాత్ర గురించి కూడా ఆయన ముచ్చటించారు. నిజానికి ఈ సిరీస్ లో జోష్ రవి గంగపుత్రుడు ప్రభ అనే పాత్రలో నటించాడు.

Bhola Shankar: ‘భోళా శంకర్’ పవన్ రిజెక్ట్ చేసిన సినిమానే.. మరి చిరు ఎందుకు చేశాడో తెలుసా?

అయితే ఈ పాత్ర చూసినప్పుడు యూట్యూబ్ లో వీడియోలు చేస్తుండే లోకల్ బాయ్ నాని గుర్తుకు వస్తాడు. అయితే అతని నుంచి ఇన్స్పైర్ అయి ఈ పాత్రను సృష్టించారా అని అడిగితే నిజానికి ముందుగా అతన్నే నటించమని అడిగామని అయితే నటన విషయంలో అనుభభం లేదు తాను చేయలేనని ఆయన అన్నాడని చెప్పుకొచ్చారు. ఇక ఈ సిరీస్ లో కనుక లోకల్ బాయ్ నాని నటించి ఉంటే అతని కెరీర్ మరో లెవల్లో ఉండేదని అనవసరంగా ఛాన్స్ మిస్ చేసుకున్నాడని అంటున్నారు. దయా క్యారెక్టర్ కోసం జేడీ చక్రవర్తిని సెలెక్ట్ చేయడం హాట్ స్టార్ డిసిషన్ అని అయితే ఆయన నటుడితో పాటు దర్శకుడు కాబట్టి ఈ కథలో ఎక్కడ ఇన్వాల్వ్ అవుతాడని అనుకున్నానని పవన్ న్నారు. జేడీ ఈ వెబ్ సిరీస్ కు నో చెప్పాలనే అనుకున్నా కానీ నేను ఫోన్ లో మాట్లాడిన తర్వాత చేయబోయే సిరీస్ ఆయనకు అర్థమై కథ పంపినా చదవకుండానే ఓకే చెప్పారని, నన్ను బాగా రిసీవ్ చేసుకున్నారని అన్నారు.

Show comments