Site icon NTV Telugu

మెగాస్టార్ బర్త్ డే… ట్విట్టర్ స్పేస్ సెషన్‌ లో ప్రముఖుల సందడి

List of celebrities attending Chiranjeevi’s birthday special Twitter space session

మెగాస్టార్ చిరంజీవి తన 66వ పుట్టినరోజు ఈ రోజు. ఈ సందర్భంగా ఆగస్టు 22ను ప్రత్యేకంగా సెలబ్రేట్ చేయడానికి భారీ ఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ట్విట్టర్ స్పేస్ సెషన్‌ లో పాల్గొని సందడి చేయనున్నారు. చిరుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకోబోతున్నారు. చిరంజీవి ఫాలోవర్స్ మెగాస్టార్ పుట్టినరోజు ప్రత్యేక ట్విట్టర్ స్పేస్ సెషన్‌కు పిలుపు అందింది. ఈ రోజు ఈ ట్విట్టర్ స్పేస్ సెషన్‌లో పాల్గొనే ప్రముఖుల జాబితాను నిర్వాహకులు విడుదల చేశారు.

Read Also : అడవిలో సల్మాన్… ఏం చేస్తున్నాడంటే?

ఈ జాబితాలో మంచు మనోజ్, అల్లరి నరేష్, ప్రకాష్ రాజ్, సంపత్ నంది, సందీప్ కిషన్, నిఖిల్, ఆది పినిశెట్టి, శ్రీ విష్ణు, నవీన్ పొలిశెట్టి, తేజ సజ్జ, అనసూయ, ప్రియదర్శి, దేవి శ్రీ ప్రసాద్, ప్రభుదేవా, రాఘవ లారెన్స్, జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్, మైత్రి మూవీ మేకర్స్, కెఎస్ రామారావు, అనిల్ సుంకర, బివిఎస్ఎన్ ప్రసాద్, బండ్ల గణేష్, రాజ రవీంద్ర, కోన వెంకట్, బ్రహ్మజీ ఉన్నారు. ఇది ట్విట్టర్ స్పేస్ సెషన్‌లో పాల్గొనే ప్రముఖుల చిన్న జాబితా. ఇంకా చాలా మంది టాలీవుడ్ ప్రముఖులు ఇందులో పాల్గొంటారు. ప్రముఖ టీవీ యాంకర్ సుమ కనకాల దీనిని హోస్ట్ గా నిర్వహిస్తున్నారు. నిర్వాహకులు స్పేస్ సెషన్ కోసం రికార్డు వీక్షకుల సంఖ్యను ఆశిస్తున్నారు. ఈ కార్యక్రమం ఈరోజు రాత్రి 7గంటల నుండి ప్రారంభమవుతుంది.

Exit mobile version