NTV Telugu Site icon

Lishi Missing: మా చెల్లి మిస్సింగ్.. పోలీసులకు హీరోయిన్ ఫిర్యాదు

Lishi Ganesh Missing

Lishi Ganesh Missing

Lishi Ganesh Missing complaint filed by heroine kushitha: రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో ఒక షాకింగ్ ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. ఈ కేసులో నిందితురాలిగా పోలీసులు చెబుతున్న యూట్యూబర్, షార్ట్ ఫిల్మ్స్ నటి లిషి కనిపించడం లేదనీ తెలుస్తోంది. ఈమేరకు ఆమె సోదరి, టాలీవుడ్ హీరోయిన్ కుషిత పోలీసులకు ఫిర్యాదు చేశారు. డ్రగ్స్ కేసులో లిషిని విచారించేందుకు ఇప్పటికే పోలీసులు ఆమె ఇంటికి నోటీసులు పంపారు సరిగ్గా ఇదే సమయంలో ఆమె కనిపించడం లేదు అని ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఇక ఆమె ఫిర్యాదు మీకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఇదే సమయంలో రాడిసన్ డ్రగ్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ రిమాండ్ రిపోర్టులో సంచలన అంశాలు వెలుగులోకి వచ్చాయి.

Director Krish: క్రిష్ డ్రగ్స్ తీసుకున్నాడు.. రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు?

డ్రగ్స్ కేసులో FIR లో మరో ఇద్దరిని నిందితులగా పోలీసులు చేర్చారు. గత ఏడాది నుండి నిందితుడు వివేక్ డ్రగ్స్ కి బానిస అయినట్లు తెలిపిన అబ్బాస్ రాడిసన్ హోటల్లో వివేక్ తన స్నేహితులైన , డైరెక్టర్ క్రిష్, నిర్భయ్ సిందీతో కలిసి డ్రగ్స్ తీసుకున్నాడని పేర్కొన్నాడు. ఈ నెల 24 జరిగిన రాడిసన్ హోటల్ డ్రగ్ పార్టీలో శ్వేత, లిషీ,నీల్ ,డైరెక్టర్ క్రిష్ కూడా కొకైన్ తీసుకున్నారని అబ్బాస్ పేర్కొన్నట్టు సమాచారం. ఇక గతంలో కూడా లిషి గణేష్ తన సోదరి కుషితతో కలిసి రాడిసన్ బ్లూ హోటల్ లోని పుడ్డింగ్ మింక్ పబ్ లో రైడ్ జరిగినప్పుడు కూడా అక్కడే ఉన్నారు. అయితే అక్కడికి ఎందుకు వెళ్లారు? అని మీడియా ప్రశ్నించినపుడు కుషిత తాను చీజ్ బజ్జీలు తినడానికి వెళ్ళాను అని చెప్పి ఒక్కసారిగా హైలైట్ అయింది. ఆ తరువాత ఆమెకు సినీ అవకాశాలు రావడమే కాదు ఏకంగా హీరోయిన్ కూడా అయింది. ఆమె హీరోయిన్ గా బిగ్ బాస్ ఫేమ్ అర్జున్ కళ్యాణ్ హీరోగా బాబు నెంబర్ 1 బుల్ షీట్ గాయ్ అనే సినిమా చేసింది. ఆ సినిమా మార్చ్ 8న ప్రేక్షకుల ముందుకి రానుంది.

Show comments