NTV Telugu Site icon

Salaar 2: సలార్ 2లో అయ్యగారు.. క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్ భార్య

Akhil

Akhil

Likitha Prashanth Neel Clarity on Akhil role in Salaar 2: కేజీఎఫ్ సిరీస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ చేసిన సలార్ కి బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా . పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రేయ రెడ్డి తదితరులు కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమాకి పార్ట్ 2 ఉంటుందని దర్శకుడు క్లైమాక్స్ లో చూపించాడు. సలార్ శౌర్యంగ పర్వం అంటూ పేరును కూడా రివీల్ చేశారు. మొదటి పార్ట్ లో ప్రశ్నలుగా మిగిలిన అన్నిటికీ వాటికి రెండో పార్టులో క్లారిటీ ఇవ్వనున్నారు. ఇక కొద్దిరోజుల క్రితమే ఈ సినిమా టీం సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకుంది. ఈ సక్సెస్ సెలబ్రేషన్స్ లో యంగ్ హీరో అఖిల్ అక్కినేని కనిపించగా సలార్ పార్ట్ 2లో అఖిల్ కనిపించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.

Asian Vaishnavi: మొన్నటిదాకా థియేటర్ వార్.. ఇప్పుడు కలిసి ఓపెనింగ్?

పార్ట్ 2 లో అఖిల్ ఉన్నాడనే చాలా మంది భావించారు. పార్ట్ 2లో దేవా తమ్ముడుగా అఖిల్ ఉంటాడు అంటూ కథనాలు కూడా రాగా ఈ విషయంపై క్లారిటీ వచ్చేసింది. ప్రశాంత్ నీల్ భార్య లిఖిత రెడ్డి ఇన్ స్టా గ్రామ్ లో ఫాలోవర్స్ తో ఇంటరాక్ట్ అయిన క్రమంలో ఈ ఈవెంట్ కి అఖిల్ ఎందుకు వచ్చారు? ఆయన సలార్ 2లో నటిస్తున్నాడా? అంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నపై ఆమె క్లారిటీ ఇచ్చారు. సలార్ 2 లో అఖిల్ ఉన్నాడు అనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని అవన్నీ రూమర్స్ మాత్రమే అని ఆమె కన్ఫర్మ్ చేసింది. అయితే హోంబలే ఫిలింస్ బ్యానర్ లో అఖిల్ ఓ సినిమా చేస్తున్నాడు.. అందుకే ఆ బ్యానర్ లో తెరకెక్కిన సలార్ సెలబ్రేషన్స్ కు ఆయనని పిలవడంతో ఆయన కూడా వచ్చాడు.

Show comments