భారత కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సాంస్కృతిక మహోత్సవాల్లో భాగస్వాములు కావాలని మెగాస్టార్ చిరంజీవి అభిమానులను కోరారు. సాంస్కృతిక మహోత్సవాలపై తాజాగా చిరంజీవి ఓ స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో విడుదల చేశారు. అందులో “భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే దేశం మన భారతదేశం. ఆ మహోన్నత సంస్కృతిని ప్రతిబింబించేలా భారత కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాల్లో జాతీయ సాంస్కృతిక మహోత్సవాలను ఈసారి మన తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తుండడం మనందరికీ గర్వకారణం.
Read Also : Bheemla Nayak : అనుకున్న దానికంటే ముందే ఓటిటిలో !
మనదేశ ఘన వారసత్వానికి నిలువెత్తు నిదర్శనంలా నిలిచే వివిధ సాంస్కృతిక కళారూపాలను ఎందరో కళాకారులు రాజమహేంద్రవరం ఈ నెల 26, 27 తేదీల్లో, వరంగల్ లో ఈ నెల 29, 30 తేదీల్లో, ఇక మన హైదరాబాద్‌లో ఏప్రిల్ 1, 2, 3 తేదీల్లో ప్రదర్శిస్తారు. మన మహోజ్వల చారిత్రక సాంస్కృతిక కళా మహోత్సవాలను తిలకిద్దాం. దాన్ని విజయవంతం చేద్దాం. మన సుసంపన్న సాంస్కృతిక వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడంలో మనందరం భాగస్వాములం అవుదామని రండి.. జైహింద్” అంటూ అంటూ మెగాస్టర్ పిలుపునిచ్చారు.
