NTV Telugu Site icon

Raviteja: డబ్బింగ్ సినిమాలని నెత్తిన పెట్టుకొని మన సినిమాలనే వదిలేస్తే ఎలా?

Raviteja

Raviteja

మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ టైగర్ నాగేశ్వర రావు. పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తూ దసరాకి రిలీజ్ అవుతున్న ఈ మూవీపై రవితేజ అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. అభిషేక్ అగర్వాల్ కూడా టైగర్ నాగేశ్వర రావు సినిమాని అగ్రెసివ్ గా ప్రమోట్ చేస్తున్నాడు. ప్రమోషనల్ కంటెంట్ కి మంచి పేరొస్తుంది, సినిమా రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయ్యే అవకాశం ఉందని అంతా అనుకుంటున్నారు. ఒక వర్గం రవితేజ ఫ్యాన్స్ మాత్రం టైగర్ నాగేశ్వర రావు మేకర్స్ పై డిజప్పాయింట్మెంట్ తో ఉన్నారు. సోషల్ మీడియాలో మేకర్స్ ని ట్యాగ్ చేసి నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. దీనికి కారణం టైగర్ నాగేశ్వర రావు సినిమాకి తగినన్న్ని థియేటర్స్ ఇవ్వకపోవడమే.

అక్టోబర్ 19న రిలీజ్ కానున్న భగవంత్ కేసరి సినిమాకి మంచి థియేటర్స్ దొరికాయి, అదే రోజు రిలీజ్ కానున్న లియో సినిమాకి కూడా ఎక్కువ థియేటర్స్ దొరికాయి. రవితేజ టైగర్ నాగేశ్వర రావు సినిమాకి మాత్రం ఆశించిన స్థాయిలో థియేటర్స్ దొరకలేదు. లియో సినిమా కన్నా టైగర్ కి థియేటర్స్ తక్కువ ఉన్నాయి అంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. భగవంత్ కేసరి సినిమా తెలుగు సినిమా కాబట్టి ఈ మూవీకి ఎక్కువ థియేటర్స్ ఇచ్చారు అంటే అందులో అర్ధం ఉంది కానీ పండగ సీజన్ లో కూడా డబ్బింగ్ సినిమాని నెత్తిన పెట్టుకోని మన సినిమాలకి అన్యాయం చేయడం ఏంటో నిర్మాతలకే తెలియాలి. లియో సినిమా కన్నా మన సినిమాలకి తమిళనాడులో ఎక్కువ థియేటర్స్ ఇస్తారా? లేక కన్నడ శివన్న సినిమా కన్నా మన సినిమాకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారా? ఎవరి ఇండస్ట్రీని వాళ్లు కాపాడుకుంటున్నప్పుడు మనం మాత్రం పరభాషా భజన చేయడం ఎందుకో? టైగర్ కి ఓపెనింగ్స్ రోజున జరగబోయే నష్టాన్ని భర్తీ చేసేదెవరో చూడాలి.