NTV Telugu Site icon

Leonardo Dicaprio: టీనేజ్ అమ్మాయిలతో ‘టైటానిక్’ హీరో!

Leonard

Leonard

Leonardo Dicaprio:’టైటానిక్’ చిత్రాన్ని 4కె 3డి ఫార్మాట్ లో రూపొందించి, మళ్ళీ విడుదల చేస్తున్నారు. ఫిబ్రవరి 10వ తేదీన ఈ కొత్త సొబగుల ‘టైటానిక్’ జనం ముందుకు రాబోతోంది. ఇదిలా ఉంటే 1997లో తొలిసారి ‘టైటానిక్’ విడుదల కాగానే, ఈ సినిమాతో హీరో లియోనార్డో డికాప్రియో రాత్రికి రాత్రి సూపర్ స్టార్ అయిపోయాడు. ముఖ్యంగా కాలేజీ అమ్మాయిల టీనేజ్ డ్రీమ్స్ లో లవర్ బాయ్ గా చోటు సంపాదించాడు. అప్పటి నుంచీ ఇప్పటి దాకా లియోనార్డో టీనేజ్ గాళ్స్ తోనే సాగుతూ ఉన్నాడని తరచూ వినిపిస్తోంది. ఈ మధ్య 19 ఏళ్ళ ఇజ్రాయెలీ మోడల్ ఈడెన్ పొలానీతో డికాప్రియో డేటింగ్ మొదలెట్టాడని విశేషంగా వినిపించింది. అందులో ఏ మాత్రం నిజం లేదని డికాప్రియో అంటున్నాడు. ఓ వేడుకలో తామిద్దరూ పాల్గొన్నామని, అక్కడివారు తామిద్దరికీ పక్కపక్కన సీట్లు కేటాయిండంతో ఆ ఫోటో చూపించి పుకార్లు లేవదీశారంటూ లియోనార్డో క్లారిటీ ఇచ్చాడు.

అది సరే, మరి నీ అసలు గర్ల్ ఫ్రెండ్ వయసు ఎంత? అంటూ నెటిజన్స్ కామెంట్స్ విసరతున్నారు. అసలు డికాప్రియో గర్ల్ ఫ్రెండ్ వయసు 19 ఏళ్ళ కంటే తక్కువ ఉంటుందనీ కొందరి మాట! అయితే ప్రముఖ హాలీవుడ్ నటుడు లోరెంజో లామాస్ కూతురు విక్టోరియా లామాస్ తో దాదాపు నాలుగేళ్ళుగా డికాప్రియో ప్రేమాయణం సాగిస్తున్నాడని వినిపిస్తోంది. ప్రస్తుతం విక్టోరియా వయసు 23 సంవత్సరాలు. అంటే ఆమెను కూడా టీనేజ్ లోనే పట్టేశాడని టాక్! డిసెంబర్ 31వ తేదీ లియోనార్డో, విక్టోరియా ఇద్దరూ ఓ పార్టీలో మీడియా కెమెరా కళ్ళకు చిక్కారు. అయితే విక్టోరియా తండ్రి లోరెంజో ‘వారిద్దరిదీ సీరియస్ వ్యవహారం కాదు’ అంటూ కొట్టిపడేశాడు. కానీ ‘డికాప్రియో అంటే విక్టోరియాకు ఎంతో ఇష్టమనీ’ లోరెంజో చెప్పడం విశేషం! మరి లియోనార్డో ఇప్పుడేమంటాడో?