NTV Telugu Site icon

Leo Second Single: మొన్న టైగర్ కా హుకుమ్.. నేడు బ్యాడ్ యాస్ .. అదిరిందయ్యా అనిరుధ్

Untitled 2

Untitled 2

Leo Second Single: అనిరుధ్.. అనిరుధ్..అనిరుధ్.. ప్రస్తుతం ఇండస్ట్రీని ఏలుతున్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచంద్రన్. స్టార్ హీరోల సినిమాలు అని చెప్పగానే మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అనేది అభిమానులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ వేరే మ్యూజిక్ డైరెక్టర్ అయినా కూడా అనిరుధ్ ను ఎందుకు పెట్టలేదు అని అడుగుతున్నారు. అంతలా అనిరుధ్ మ్యూజిక్ తో మ్యాజిక్ చేస్తున్నాడు. ప్రస్తుత ఇండస్ట్రీలో మనోడు తోపు అంటే అతిశయోక్తి కాదు. ఇక ఈ మధ్యనే జైలర్ సినిమాలో టైగర్ కా హుకుమ్ లాంటి ఎలివేషన్స్ సాంగ్ ఇచ్చి రజనీకాంత్ కు ఓ రేంజ్ తీసుకొచ్చిపెట్టాడు. ఇక ఈ సినిమా 100% విజయం అందుకుంది అంటే అందులో సగానికి పైగా అనిరుధ్ మ్యూజికే కారణమని ఎవరిని అడిగినా చెప్తారు. ఈ సినిమా తర్వాత అనిరుధ్.. లియో సినిమాకు పనిచేస్తున్న విషయం తెలిసిందే.

RGV: ఆర్జీవీ కంట్లో పడిన పిల్ల ఎవరో తెలిసిపోయిందోచ్..

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, త్రిష జంటగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం లియో. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి రెండవ సింగిల్ లియోదాస్..బ్యాడ్ యాస్ అంటూ సాగే సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ కూడా జైలర్లోని టైగర్ కా హుకుమ్ లానే హీరోకు మంచి ఎలివేషన్ సాంగ్ లా అనిపిస్తుంది. ఈ సాంగ్ ను అనిరుధ్ స్వయంగా పాడాడు. ప్రస్తుతం ఈ పాట నెట్టింట వైరల్ గా మారింది. ఈ సాంగ్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా అలరిస్తుందో చూడాలి.

Show comments