Lenin : రిజనబుల్ ధరకే ‘లెనిన్’ నైజాం టికెట్ ధరలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అక్కినేని అఖిల్ హీరోగా మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న మోస్ట్ అవేటెడ్ యాక్షన్ డ్రామా ‘లెనిన్’. జూలై 10న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతున్న ఈ చిత్రంపై ఇప్పటికే ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వరుస ప్లాప్స్ తో ఇబ్బందిపడుతున్న అక్కినేని అఖిల్ కు ఈ సినిమా సాలిడ్ కంబ్యాక్ అవుతుందని యూనిట్ ధీమాగా ఉంది.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో ఈ సినిమా టికెట్ ధరలకు సంబంధించిన ఒక సానుకూల వార్త ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మధ్యకాలంలో వస్తున్న పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు విపరీతంగా పెంచేస్తుండటంతో సామాన్య ప్రేక్షకులు థియేటర్లకు రావడానికి కాస్త వెనకాడుతున్నారు. అయితే ‘లెనిన్’ చిత్ర బృందం మాత్రం ప్రేక్షకులకు ఎటువంటి భారం పడకుండా చాలా రీజనబుల్ అండ్ అఫోర్డబుల్ ప్రైసింగ్తో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. హైదరాబాద్ వ్యాప్తంగా ఈ చిత్రానికి చాలా అనుకూలమైన ధరలను ఫిక్స్ చేశారు. హైదరాబాద్ లో సింగిల్ స్క్రీన్స్ రూ. 150, మల్టీప్లెక్స్‌లో రూ. 250 టికెట్ ధరలను ఫిక్స్ చేసారు. ఈ రీజనబుల్ ప్రైసింగ్ స్ట్రాటజీ ఖచ్చితంగా సాధారణ ప్రేక్షకులను ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్‌ను పెద్ద సంఖ్యలో థియేటర్లకు రప్పించేందుకు హెల్ప్ అవుతుందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. నార్మల్ ప్రైసింగ్ తో పాటు ఒకరోజు ముందుగా ప్రీమియర్స్ కూడా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఎస్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లను రాబడుతుందో చూడాలి.
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
తాజావార్తలు
-
Gautam Gambhir: చీఫ్ సెలెక్టర్ పదవికి అగార్కర్ గుడ్ బై.. ‘డియర్ అజిత్ భాయ్’ అంటూ గంభీర్ ఎమోషనల్..!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!