Imran Khan Talks About Lekha Washington : లేఖా వాషింగ్టన్ తమిళ వాలెంటైన్స్ డేలో తొలిసారిగా నటించింది. ఆ సినిమా తర్వాత ఉన్నాలే ఉన్నాలే, జయం కొండన్, వా, కళ్యాణ తనిఖీ చాదం, అరిమా నంబి అనే తమిళ చిత్రాల్లో నటించారు. తమిళంతోపాటు తెలుగు, కన్నడ, హిందీ చిత్రాల్లోనూ నటించిన ఆమె ఇప్పుడు సినీ పరిశ్రమకు దూరమైంది. తెలుగులో వేదం సినిమాలో లాస్య అనే పాత్రలో నటించిన ఆమె ఆ తరువాత కమీనా అనే సినిమాలో కూడా నటించింది. ఇక మంచు విష్ణు డైనమైట్ సినిమాలో ఒక అతిధి పాత్రలో కనిపించిన ఆమె ఆ తరువాత పూర్తిగా సినిమాలకు దూరమైంది. ఇక 37 ఏళ్ల లేఖా వాషింగ్టన్ విడాకులు తీసుకున్న నటుడితో డేటింగ్ చేస్తోంది. ఇక అతను మరెవరో కాదు నటుడు అమీర్ ఖాన్ మేనల్లుడు ఇమ్రాన్ ఖాన్. అతను లేఖా వాషింగ్టన్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు ఇటీవల పుకార్లు వచ్చాయి. లేఖ కారణంగానే అవంతికకు ఇమ్రాన్ విడాకులు ఇచ్చాడని జనాలు భావించారు.
Anushka Marriage: త్వరలో నిర్మాతతో అనుష్క పెళ్లి?
అయితే ఇటీవల, నటుడు ఒక ఇంటర్వ్యూలో తన విడాకుల గురించి, లేఖతో తన సంబంధం గురించి బహిరంగంగా మాట్లాడటం కనిపించింది. ఇమ్రాన్ ఖాన్ మొదటి వివాహం ఎక్కువ కాలం కొనసాగలేదు. ఇమ్రాన్ మొదటి వివాహం అవంతిక మాలిక్‌తో జరగగా వారికి ఒక కుమార్తె కూడా ఉంది. తన విడాకుల గురించి ఇమ్రాన్ మాట్లాడుతూ, ‘నేను మరియు అవంతిక పరస్పర అంగీకారంతో విడిపోయాము. నేను ఫిబ్రవరి 2019 నుండి అవంతిక నుండి విడిగా నివసిస్తున్నా, నేను బహుశా ఇంతకు ముందు దీని గురించి ప్రస్తావించలేదు. ‘లేఖను కొంప కూల్చిన దానిగా పిలుస్తున్నారని విన్నప్పుడు నేను ఎంత బాధపడ్డానో చెప్పలేను. అవంతిక వెళ్లిపోయాక నా జీవితంలోకి లేఖ వచ్చింది. అంతకు ముందు నేను ఒకటిన్నర సంవత్సరాలు ఒంటరిగా జీవించాను. నాతో ఎవరూ లేరు కాబట్టి లేఖ నన్ను సపోర్ట్ చేసింది. నా విడాకులకు ఆమె కారణం కాదు అని అన్నారు. లేఖా వాషింగ్టన్ నా జీవితానికి సానుకూలతను, ఆరోగ్యాన్ని తీసుకొచ్చిందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. నేను ఒత్తిడికి లోనైనప్పుడు నాకు సహాయం చేసి నన్ను బాగా చూసుకునేది. ఆమె లేకుండా నేను జీవితాన్ని కొనసాగించగలనో లేదో నాకు తెలియదు అని అన్నారు.