Site icon NTV Telugu

Ananya Nagalla: అనన్య నాగళ్ల చేతుల మీదుగా ‘లెగ్దా డిజైన్ స్టూడియో’ ప్రారంభం

Ananya

Ananya

ఫ్యాషన్‌ ప్రపంచంలో మహిళల కలలకు రంగులు అద్దుతూ, వైవిధ్యమైన డిజైన్‌లతో అలరిస్తున్న ‘లెగ్దా డిజైన్ స్టూడియో’ తన రెండో బ్రాంచ్‌ను హబ్సిగూడలో ఘనంగా ప్రారంభించింది. టాలీవుడ్ హీరోయిన్ అనన్య నాగళ్ల ఈ బ్రాంచ్‌ను ఆవిష్కరించగా, ఈ కార్యక్రమంలో ఫ్యాషన్ డిజైనర్ దివ్య కర్నాటి, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఎన్‌విఎస్ఎస్ ప్రభాకర్, కాంగ్రెస్ నాయకులు దర్గా దయాకర్, బీఆర్ఎస్ నాయకులు మంద సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకలో భాగంగా నిర్వహించిన ఫ్యాషన్ స్ట్రీట్ వాక్ షో అందరి దృష్టిని ఆకర్షించింది. మోడల్స్ ఆధునిక ఫ్యాషన్ డిజైన్‌లను అద్భుతంగా ప్రదర్శించి, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన అనన్య నాగళ్ల, “మహిళలు తమ కలల డిజైన్‌లను ధరించి, స్వయం ప్రతిష్ఠను పొందేందుకు ‘లెగ్దా డిజైన్ స్టూడియో’ చేస్తున్న ప్రయత్నం అభినందనీయం. మహిళలకు ఉపాధి కల్పిస్తూ, వారి సృజనాత్మకతకు మద్దతుగా నిలుస్తున్న దివ్య కర్నాటి గారిని అభినందిస్తున్నాను. ఈ బ్రాంచ్ ద్వారా మరింత మంది మహిళలు తమ ఫ్యాషన్ కలలను సాకారం చేసుకుంటారని నమ్ముతున్నాను,” అని అన్నారు.

Exit mobile version