Site icon NTV Telugu

Leharaayi: బొత్స మేనల్లుడి సినిమా టైటిల్ ఖరారు!

Leharayii

Leharayii

‘నువ్వు నేను ఒక్కటవుదాం’, ‘జువ్వ’ చిత్రాలలో హీరోగా నటించిన బొత్స సత్యనారాయణ మేనల్లుడు రంజిత్ సోమి తాజా చిత్రం ‘లెహరాయి’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా టైటిల్ లోగోను గురువారం ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్ లో దర్శకుడు కొండా విజయ్ కుమార్ ఆవిష్కరించారు. ప్రముఖ నిర్మాత బెక్కెం వేణు సమర్పకుడిగా వ్యవహరిస్తున్న ‘లెహరాయి’ సినిమాను రామకృష్ణ పరమహంస దర్శకత్వంలో మద్దిరెడ్డి శ్రీనివాస్ నిర్మించారు. ఇదే వేదికపై ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులోని రెండు పాటలనూ మీడియాకు ప్రదర్శించారు.

‘తనతో ప్రేమలో పడిన హీరోకు… దాన్ని మించిన లక్ష్యం ఒకటి తనకుందని కథానాయిక నచ్చ చెబుతుందని, జీవితంలో ప్రేమ ఒక భాగమే అన్న విషయాన్ని గుర్తించాలని కోరుతుందని, ఆ తర్వాత వారి ప్రేమ ప్రయాణం ఎలా సాగిందన్నదే ఈ చిత్ర కథ’ అని నిర్మాత శ్రీనివాస్ చెప్పారు. ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ తమకు మంచి గుర్తింపు తెచ్చిపెడుతుందనే ఆశాభావాన్ని హీరో రంజిత్, డైరెక్టర్ రామకృష్ణ పరమహంస వ్యక్తం చేశారు. ఇది సంగీత దర్శకుడిగా తనకు 72వ చిత్రమని, ఇక మీదట ‘జీకే’ పేరుతో సంగీతం ఇవ్వబోతున్నానని ఘంటాడి కృష్ణ చెప్పారు.

సౌమ్య మీనన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అలీ, గగన్ విహారి, రావు రమేశ్‌, నరేశ్‌, సంధ్య జనక్, ‘సత్యం’ రాజేశ్‌, తోటపల్లి మధు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ మూవీ ఆడియోను విడుదల చేయబోతున్న టిప్స్ సంస్థ తరఫున రాజూ హిర్వానితో పాటు చిత్ర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Exit mobile version