Site icon NTV Telugu

Ponniyin Selvan 2: చోళులు ఓటీటీలోకి వచ్చేసారు… స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?

Ponniyin Selvan 2

Ponniyin Selvan 2

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ రేటెడ్ డైరెక్టర్స్ లో స్టొరీ టెల్లింగ్ జీనియస్ గా పేరు తెచ్చుకున్న దర్శకుడు మణిరత్నం. మూవీ మేకింగ్ మాస్టర్ గా పేరున్న మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన సెకండ్ ఇన్స్టాల్మెంట్ ‘పోన్నియిన్ సెల్వన్ 2’. పొన్నియిన్ సెల్వన్ సినిమాకి సీక్వెల్ గా ఆడియన్స్ ముందుకి వచ్చిన ఈ మూవీ ఏప్రిల్ 28న రిలీజ్ అయ్యి తమిళనాట సెన్సేషనల్ కలెక్షాన్స్ ని రాబట్టింది. ఈ ఇయర్ కోలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచిన పొన్నియిన్ సెల్వన్ 2, ఓవరాల్ గా కోలీవుడ్ టాప్ 5లో చోటు దక్కించుకుంది. ఎక్కడ తమిళులు ఉంటే అక్కడ పోన్నియిన్ సెల్వన్ 2 సినిమా సెన్సేషనల్ బాక్సాఫీస్ నంబర్స్ ని రాబట్టింది. ఇతర ప్రాంతాల్లో కూడా మంచి టాక్ ని సొంతం చేసుకున్న PS-2 పరవాలేదనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. ముఖ్యంగా తెలుగులో పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 1 ఊహించని నెగిటివిటీని సొంతం చేసుకుంది.

ఆ నెగిటివిటీని పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 పూర్తిగా చెరిపేసి మంచి ఫీడ్ బ్యాక్ సొంతం చేసుకుంది. ఇదే సమయంలో రిలీజ్ అయిన ఏజెంట్ సినిమా ఫ్లాప్ అవ్వడం కూడా పొన్నియిన్ సెల్వన్ 2 బాగా కలిసొచ్చింది. ఇండియాలోనే కాదు యుఎస్ మార్కెట్ లో కూడా పోన్నియిన్ సెల్వన్ 2 భారీగా వసూల్ చేసింది. ఈ మధ్య కాలంలో తమిళనాడులో ఇంత ప్రాఫిటబుల్ సినిమా ఇంకొకటి రాలేదు. థియేట్రికల్ రన్ అన్ని ప్రాంతాల్లో ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడంతో పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లోకి చోళులు ఎంటర్ అయ్యారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పొన్నియిన్ సెల్వన్ 2 అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ ఎపిక్ సాగాని థియేటర్ లో మిస్ అయిన వాళ్లు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.

 

Exit mobile version