NTV Telugu Site icon

Lal Salaam: డబ్బింగ్ కంప్లీట్ చేసిన వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్…

Lal Salaam

Lal Salaam

సూపర్ స్టార్ రజినీకాంత్ గెస్ట్ రోల్ లో… ఆయన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘లాల్ సలామ్’. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా సంక్రాంతి రిలీజ్ కి రెడీ అవుతోంది. క్రికెట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో హీరోగా టాలెంటెడ్ యాక్టర్ ‘విష్ణు విశాల్’ నటిస్తున్నాడు. మరో ఇంపార్టెంట్ రోల్ లో విక్రాంత్ కనిపించనున్నాడు. రజినీకాంత్ క్యామియో స్పెషల్ గా ఉంటుందని టాక్, రజినీకి చెల్లి పాత్రలో జీవిత రాజశేఖర్ నటించింది. ఇన్ని స్పెషల్ ఎలిమెంట్స్ ఉన్న ఈ సినిమా టీజర్ ని మేకర్స్ ఇటీవలే లాంచ్ చేసారు. టీజర్ చూస్తే లాల్ సలాం సినిమాలో క్రికెట్ తో పాటు మతాలకి సంబంధించిన సెన్సిటివ్ పాయింట్ ని కూడా టచ్ చేసినట్లు తెలుస్తుంది. రా అండ్ రస్టిక్ గా తెరకెక్కిన ఈ సినిమా ఫీల్ ని క్యారీ చేసేలా టీజర్ ని కట్ చేసారు.

లాల్ సలామ్ టీజర్ లో రజినీకాంత్ “మొయినుద్దీన్ భాయ్”గా కొత్త లుక్ లో కనిపించి ఫ్యాన్స్ ని ఖుషి చేసాడు. సినిమాలో రజినీకాంత్ ఎంతసేపు ఉంటాడు అనే విషయంలో క్లారిటీ లేదు కానీ రజినీకాంత్ ఉండడం వలన లాల్ సలామ్ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అయ్యింది. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ నుంచి మేకర్స్ కొత్త అప్డేట్ ఇచ్చారు. ఇండియన్ క్రికెట్ టీమ్ లెజెండ్, వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ కపిల్ దేవ్… లాల్ సలామ్ సినిమాలో స్పెషల్ రోల్ ప్లే చేసాడు. క్రికెట్ నేపధ్యం ఉన్న సినిమా కాబట్టి కపిల్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి ఉంటాడు. తన పాత్రకి సంబంధించిన డబ్బింగ్ ని కపిల్ దేవ్ కంప్లీట్ చేసాడు. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్ ట్వీట్ చేసారు. మరి లాల్ సలామ్ సినిమా థియేటర్స్ లో ఎంతవరకు మెప్పిస్తుందనే విషయం చూడాలి.

Show comments