NTV Telugu Site icon

NTR: రీరిలీజ్ కి రెడీ అవుతున్న అన్నగారి ఇండస్ట్రీ హిట్ సినిమా…

Ntr

Ntr

ప్రస్తుతం తెలుగు ఫీల్మ్ ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ నడుస్తోంది. ఒకప్పటి హిట్ సినిమాలని మళ్లీ రిలీజ్ చేస్తూ ఫాన్స్ థియేటర్స్ లో హంగామా చేస్తున్నారు. ఈ రీరిలీజ్ ట్రెండ్ ని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్తూ ఎన్టీఆర్ ఫాన్స్ సెన్సేషన్ క్రియేట్ చేసారు. ఇరవై ఏళ్ల క్రితం రిలీజ్ అయిన సింహాద్రి సినిమాని 1200కి పైగా థియేటర్స్ లో రిలీజ్ చేసి ఫాన్స్ చేసిన హంగామా సోషల్ మీడియాలో ఇంకా మారుమోగుతూనే ఉంది. ఇప్పుడు ఈ రీరిలీజ్ ట్రెండ్ లోకి అన్నగారి సినిమాని కూడా తెస్తున్నారు నందమూరి అభిమానులు. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్లు ఉన్న ప్రతి చోటా ఘనంగా జరుగుతున్నాయి. ఈ సంబరాలు అంబరాలు తాకేలా చెయ్యడానికి నందమూరి అభిమానులు ‘అడవి రాముడు’ సినిమాని రీరిలీజ్ చేస్తున్నారు. మే 28న ఎన్టీఆర్ జయంతి రోజున అడవి రాముడు సినిమా 4K వెర్షన్ లో రీరిలీజ్ కానుంది.

ఎన్టీఆర్, జయప్రద, జయసుధ నటించిన అడవి రాముడు సినిమా తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక బెంచ్ మార్క్ మూవీగా నిలిచిపోయింది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు ఈ సినిమాని ఒక మాస్ హిస్టీరియా క్రియేట్ చేసేలా రేంజులో తెరకెక్కించారు. ఎన్టీఆర్ ఏనుగు పైన ఎక్కిన దగ్గర నుంచి ఫారెస్ట్ ఆఫీసర్ గా చేంజ్ ఓవర్ చూపించే వరకూ ప్రతి సీన్ ఒక అద్భుతం. అప్పటి కమర్షియల్ సినిమా చూసిన పీక్ ‘అడవి రాముడు’. మహదేవన్ ఇచ్చిన సాంగ్స్ ఇప్పటికీ ఎక్కడో ఒక చోట వినిపిస్తూనే ఉంటాయి. ‘కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు’, ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ సాంగ్స్ అప్పట్లో ఆడియన్స్ ని ఉర్రూతలూగించాయి. అలాంటి ఒక బెంచ్ మార్క్ సినిమా రీరిలీజ్ అవుతుంది అంటే నందమూరి అభిమానులు మాములు జోష్ లో ఉండరు. అయితే అడవి రాముడు రీరిలీజ్ కేవలం అమెరికా వరకు మాత్రమే పరిమితం అయ్యింది. అమెరికాలో 75 సెంటర్స్ లో అడవు రాముడు రీరిలీజ్ అవ్వనుంది. మరి ఆ తర్వాత అయినా తెలుగులో అడవి రాముడు సినిమాని రీరిలీజ్ చేస్తారేమో చూడాలి.