NTV Telugu Site icon

Legend Saravanan: సంచలన నిర్ణయం.. పెద్ద ట్విస్ట్ ఇచ్చాడే!

Saravanan Next Movie

Saravanan Next Movie

Legend Saravanan Preparing For Second Film: లెజెండ్ శరవణన్.. బిగ్గెస్ట్ రిటెయిల్ చైన్స్ శరవణన్ స్టోర్స్ అధినేత అయిన ఆయన, రీసెంట్‌గా ‘లెజెండ్’ అనే పాన్ ఇండియా సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే! నిజానికి, ఆయన ఎప్పట్నుంచో సినిమాల్లో నటించాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. కానీ, పరిస్థితులు అనుకూలించకపోవడంతో వెనకడుగు వేస్తూ వచ్చాడు. ఎట్టకేలకు ఇన్నాళ్ల తర్వాత సమయం రావడంతో, హీరోగా అవతారమెత్తి తన చిరకాల వాంఛని తీర్చుకున్నాడు. 53 ఏళ్ల వయసులో కథానాయకుడిగా ఎంట్రీ ఇచ్చి, అంత లేటు వయసులో డెబ్యూ ఇచ్చిన నటుడిగా చరిత్ర సృష్టించాడు.

అయితే.. ‘లెజెండ్’ సినిమా భారీ నష్టాలను మిగిల్చింది. అంతేకాదు, శరవణన్‌పై ఎన్నో ట్రోల్స్ కూడా వచ్చాయి. హీరోగా కాదు కదా, కనీసం సైడ్ క్యారెక్టర్‌కి కూడా పనికిరాడంటూ నెటిజన్లు విమర్శలు ఎక్కుపెట్టారు. సర్వత్రా ఆయనకు అవమానాలే మిగిలాయి కానీ, పాజిటివ్‌గా ఏదీ అనుకూలించలేదు. ఈ నేపథ్యంలోనే శరవణన్ ఇకపై సినిమాలు చేయకపోవచ్చని, తిరిగి తన బిజినెస్‌పై దృష్టి సారిస్తాడని అంతా అనుకున్నారు. హీరో అవ్వాలనే తన కల ‘లెజెండ్’తో తీరింది కాబట్టి, ఇక సినిమాలకు గుడ్ బై చెప్పొచ్చని భావించారు. కానీ, అందరి అంచనాల్ని తిప్పికొడుతూ శరవణన్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మరో సినిమా చేసేందుకు సమాయత్తమవుతున్నాడు. అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం.

కోలీవుడ్ సమాచారం ప్రకారం.. రొమాంటిక్ డ్రామా జోనర్‌లో శరవణన్ తన నెక్ట్స్ సినిమా చేయనున్నాడట! ఆల్రెడీ ఓ నూతన దర్శకుడితో చర్చలు జరగడం, కథ ఫైనల్ చేయడం జరిగిపోయాయట! త్వరలోనే ఇతర ఫార్మాలిటీస్ ముగించుకొని, గ్రాండ్‌గా అనౌన్స్ చేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. దీన్ని కూడా పాన్ ఇండియా సినిమాగానే తీర్చిదిద్దనున్నట్టు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో నిర్మించనున్న ఈ సినిమా కోసం, ఓ స్టార్ హీరోయిన్‌ని రంగంలోకి దింపనున్నట్టు టాక్ వినిపిస్తోంది. సో.. మరో సంచలనం త్వరలోనే రాబోతోందన్నమాట!