Leader Re Release: ప్రస్తుతం టాలీవుడ్ లో రీ రిలీజ్ ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెల్సిందే. హీరోల పాత సినిమాలను 4k లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. హీరోల పుట్టినరోజులు, స్పెషల్ అకేషన్స్ కు వారి హిట్ సినిమాలను రిలీజ్ చేయడంతో అప్పట్లో థియేటర్ లో రచ్చ చేయని అభిమానులు ఇప్పుడు ఆ కోరికను తీర్చుకుంటున్నారు. ఇక ఇప్పటివరకు స్టార్ హీరోల సినిమాలు రీరిలీజ్ అయ్యి మంచి కలక్షన్స్ రాబట్టి. తాజాగా మరో సినిమా రీ రిలీజ్ కు సిద్దమవుతుంది. అయితే ఈ సినిమా రీ రిలీజ్ కు ఈ సమయం ఎంతో అద్భుతమైంది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు. ఆ సినిమా ఏదో కాదు.. లీడర్. పేరు వినగానే పాలిటిక్స్ గుర్తొచ్చాయి కదా.
Neha Shetty:నడుము అందాలతో కుర్రకారుల గుండెల్లో సెగలు పుట్టిస్తున్న నేహా శెట్టి
ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో అందరికీ తెల్సిందే. ఇలాంటి సమయంలో లీడర్ సినిమాను రీరిలీజ్ చేయడం యాధృచ్చికంగా జరుగుతుంది కాదు అని ఇప్పటికే అర్దమైపోయి ఉండాలి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దగ్గుబాటి రానా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన సినిమా. అప్పట్లో ఈ సినిమా జగన్ బయోపిక్ అని కూడా చెప్పుకొచ్చారు. సీఎం అయిన తండ్రి చనిపోవడం.. ఆయన స్థానంలో రావడానికి ఎంతోమంది కుట్రలు చేస్తుండడం.. చివరికి తల్లికి ఇచ్చిన మాట కోసం కొడుకు సీఎం స్థానంలోకి వెళ్లడం.. అవినీతి రాజకీయ నాయకుల ఆట కట్టించడంతో పాటు ప్రజల సమస్యలను అర్ధం చేసుకొనే నిజాయితీగల సీఎంగా రానా కనిపించాడు. రిలీజ్ అయ్యినప్పుడు ఈ సినిమా ఆసక్తిని కలిగించిందే కానీ, ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. రానా కెరీర్ లోనే ది బెస్ట్ సినిమా అంటే లీడర్ అనే చెప్పుకొస్తారు. మొదటి సినిమాలోనే ఎంతో పరిణితి చెందిన నటుడిగా కనిపించి మెప్పించాడు. ఇక ఈ సినిమా మరోసారి రిలీజ్ చేయాలనీ మేకర్స్ భావిస్తున్నారట. ఎలక్షన్స్ సమయంలో ఈ సినిమా రిలీజ్ అయితే.. ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది అందరికి తెలుసు. త్వరలోనే ఈ సినిమా రీరిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించనున్నారు. మరి ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.
