‘అందాల రాక్షసి’ లాంటి మొదటి సినిమాతోనే ప్రేక్షకులను అలరించింది నటి లావణ్య త్రిపాఠి. ప్రస్తుతం సినిమా అవకాశాలు బాగానే వున్నా సరైన హిట్ లేక వెనకబడిపోతుంది. ఇదిలావుంటే, ఇటీవల అభిమానులతో ఇన్ స్టాగ్రామ్ లైవ్ ముచ్చటించిన ఆమె తనకు ఓ సమస్య ఉందంటూ చెప్పుకొచ్చింది. తనకు ‘ట్రిపోఫోబియా’ ఉందని తెలిపింది. కొన్ని వస్తువులు, ఆకారాలను చూసినప్పుడు తనకు తెలియకుండానే భయం కలుగుతుందని ఆమె చెప్పింది. ఆ సమస్య నుంచి బయటపడేందుకు కొన్నాళ్లుగా ప్రయత్నాలు చేస్తున్నానని తెలిపింది. ప్రస్తుతం తను ఆహ్లదకరమైన జీవితాన్ని చూస్తున్నానని, కాంక్రిట్ జంగిల్‌కు దూరంగా ప్రకృతి ఒడిలో సేదతీరుతూ వృత్తిపరమైన ఒత్తిడుల నుంచి ఉపశమనం పొందుతున్నట్లు చెప్పింది. స్వీయ విశ్లేషణ వలనే నేను చేసే తప్పొప్పుల్ని సరిదిద్దుకునే అవకాశం దొరుకుతుందని లావణ్య చెప్పుకొచ్చింది.
అవి చూస్తే.. తెలియకుండానే భయపడుతున్నా: లావణ్య త్రిపాఠి
