Lavanya Tripathi Leg Injured: ఆంధ్రప్రదేశ్ లో పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో మెగా కుటుంబ సభ్యులందరూ నిన్ననే బయలుదేరి గన్నవరం వెళ్లారు. అక్కడి నుంచి ప్రమాణస్వీకారం కార్యక్రమానికి కూడా హాజరయ్యారు. అయితే వారందరూ ప్రమాణ స్వీకారానికి వెళితే మెగా కోడలు, హీరోయిన్ లావణ్య త్రిపాఠి మాత్రం ఇంటికి పరిమితం అయ్యారు. ఎందుకంటే ఆమె కాలికి గాయమైంది. తన కుడికాలికి గాయం అయిందని, తాను ప్రస్తుతానికి కోలుకుంటున్నాను అంటూ ఆమె ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో ఒక ఫోటో ఆమె షేర్ చేశారు. అయితే పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో గెలుపొందిన రోజున తన అన్న ఆశీర్వాదం కోసం చిరంజీవి నివాసానికి వెళ్లారు. ఆ సమయంలో వరుణ్ తేజ్ తో పాటు లావణ్య త్రిపాఠి కూడా కనిపించింది.
Darshan: మర్డర్ స్పాట్లో దర్శన్ కారు.. ఇక ఇరుక్కున్నట్టే?
కానీ అప్పుడు ఆమె కాలికి ఎలాంటి కట్టు కనిపించలేదు. ఆ తరువాత ఆమె కాలికి గాయమైనట్లుగా చెబుతున్నారు. అయితే ఈ గాయం షూటింగ్ చేస్తున్న సమయంలో జరిగిందా? లేక ఇంట్లోనే ఏదైనా గాయం జరిగిందా అనే విషయం మీద మాత్రం క్లారిటీ లేదు. ఇక గాయమైన నేపథ్యంలో ఆమె పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేకపోయినట్లుగా తెలుస్తోంది. మరొక పక్క పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం ఆఫర్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు పలువురు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. దానికి తగ్గట్టుగానే చిరంజీవి, అమిత్ షా, అఖిరా నందన్ వంటి వాళ్ళు డిప్యూటీ సీఎంకి అభినందనలు అంటూ పోస్టులు పెట్టడంతో ఆయనకు డిప్యూటీ సీఎం పదవి ఖరారు అయినట్లే. అయితే మంత్రివర్గం ప్రకారం ఎలాంటి శాఖ ఆయనకు ఇవ్వబోతున్నారు అనే విషయం మీద చర్చ జరుగుతుంది. పంచాయతీరాజ్ శాఖ ఇచ్చే అవకాశం ఉందని ఒక ప్రచారం జరుగుతున్నా, అధికారిక ప్రకటన వచ్చేవరకు ఈ విషయం మీద క్లారిటీ వచ్చే అవకాశం తక్కువే.