NTV Telugu Site icon

Lavanya: మాల్వీ నా రాజ్ ను వదిలేయ్ ప్లీజ్.. ఈ కష్టం పగవాళ్లకు కూడా రావద్దు!

Raj Tarun Lavanya

Raj Tarun Lavanya

Lavanya Begs Malvi Malhotra to leave Raj Tarun: హీరో రాజ్ తరుణ్ లావణ్య వ్యవహారంలో పోలీసులు కేసు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జ్ షీట్ లో రాజ్ తరుణ్ ని నిందితుడిగా చేర్చారు పోలీసులు. ఈ అంశం మీద ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన లావణ్యను మాల్వి మల్హోత్రాతో అఫైర్ వల్లనే మీరు బయటకు వచ్చారా అని ప్రశ్నిస్తే ఆమె సమాధానమిచ్చారు. మాల్వి మల్హోత్రాతో అఫైర్ ఉండడంతోనే నన్ను రాజ్ తరుణ్ వదిలించుకున్నాడు ఇది నిజం అని ఆమె అన్నారు. నేను రాజ్ తరుణ్ భార్యను అని మరోసారి కోర్టు చెప్పిన తర్వాత మనం ఇలాగే మాట్లాడుకుంటాం అని ఆమె అన్నారు.. నాకు పట్టిన గతి ఏ ఆడదానికి ముఖ్యంగా పగవాళ్ళకి కూడా రాకూడదు అని ఆమె అన్నారు. లవ్ మ్యారేజ్ అయినప్పటికీ మా పేరెంట్స్ రాజ్ తరుణ్ కి పలు సందర్భాల్లో 70 లక్షల వరకు ఇచ్చారు. దానికి తగ్గ ప్రామిసరీ నోట్లు చెక్కులు ఉన్నాయి, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉన్నాయి.

Lavanya: నేను చౌదరి, రాజ్ తరుణ్ బ్రాహ్మిణ్.. పెళ్లి కాకపోతే అవెందుకు కొంటాడు?

అలా ఉన్న వాటి ఆధారంగా 70-80 లక్షల వరకు ఇచ్చాము అని ఆమె అన్నారు. మా పేరెంట్స్ రెండు స్థలాలు అమ్మి అతనికి డబ్బులు ఇచ్చారు. రెండు స్థలాలు నా పెళ్లి కోసం కొన్న స్థలాలు అమ్మేసి రాజ్ తరుణ్ కి డబ్బులు ఇచ్చారు. మాల్వి మల్హోత్రాలతో ఏర్పడిన అఫైర్ కారణంగానే నన్ను వదిలించుకోవాలి అనుకున్నాడు అందుకే నేను బయటకు రావాల్సి వచ్చింది. అతనికి ఆమెతో అఫైర్ ఉన్నా సరే నాకు ఇబ్బంది లేదు కానీ నన్ను వదిలించుకోవాలనుకున్నాడు అదే తాను బయటకు రావడానికి కారణం అని అన్నారు. నాకు ఇక్కడ ఒక ప్రపంచం ఉంది, 11 సంవత్సరాల నుంచి బయటికి రాలేదు అంటే నేను లేను అని అర్థం కాదు నేను ఉన్నాను బట్ నా మనిషినే ఆమె తీసేసుకోవాలనుకుంది, దూరం చేసింది. ఇప్పటికీ నా మనిషి ఆమెతోనే ఉన్నాడు. ఎన్ని రోజులు తప్పించుకుని తిరుగుతాడు? అని ఆమె ప్రశ్నించారు. మాల్వీ మల్హోత్రా ఇది తప్పు దయచేసి నా మనిషిని నాకు వదిలేయ్, మా కష్టాలు మేం పడతాం. మా కేసులు మేము చూసుకుంటాం. ఏదైనా సరే మేము చేసుకుంటాం దయచేసి నువ్వు వదిలేయ్ అని ఆమె అన్నారు.

Show comments