Site icon NTV Telugu

Bollywood Khans: ఒక్క మీటింగ్ తో ఇంటర్నెట్ షేక్ చేస్తున్నారు…

Tiger Pataan

Tiger Pataan

షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్… ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి మెయిన్  పిల్లర్స్ లాంటి వాళ్లు. ‘కరణ్-అర్జున్’, హమ్ తుమ్హారే హై సనమ్’, ‘కుచ్ కుచ్ హోతా హై’, ‘హర్ దిల్ జో ప్యార్ కరేగా’, ‘ఓం శాంతి ఓం’, ‘ట్యూబ్ లైట్’, ‘జీరో’ లాంటి సినిమాల్లో కలిసి కనిపించిన ఈ ఇద్దరు హీరోల కెరీర్ గ్రాఫ్ దాదాపు ఒకేలాగే ఉంటుంది. ప్రొఫెషనల్ రైవల్రీనే కాదు, పర్సనల్ రైవల్రీని కూడా దశాబ్దాల పాటు మైంటైన్ చేశారు షారుక్, సల్మాన్. ఎన్ని గొడవలు ఉన్నా బయట ఒకరికి సమస్య వస్తే ఇంకొకరు వెంటనే స్పందించడం వీరి రిలేషన్షిప్ లో ఉన్న గొప్ప విషయం. షారుఖ్ కొడుకు డ్రగ్స్ కేసులో ఇరుక్కున్నప్పుడు సల్మాన్, షారుఖ్ కి అండగా నిలబడ్డాడు. అంతటి స్నేహబంధం కలిగిన ఈ ఇద్దరు ఎప్పుడు కలిసినా అదో నేషనల్ సెన్సేషన్ అవ్వడం గ్యారెంటి. నేడు సల్మాన్ ఖాన్ పుట్టిన రోజు కావడంతో అలాంటి అరుదైన సంఘటనే మరోసారి జరిగింది. షారుఖ్ స్వయంగా వెళ్లి సల్మాన్ ఖాన్ ని పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న కెమెరా బగ్స్ షారుఖ్, సల్మాన్ ల అరుదైన కలయికలో క్యాప్చర్ చేశాయి. దీంతో షారుఖ్, సల్మాన్ ఖాన్ లు కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒక వీడియోలో సల్మాన్, షారుఖ్ హాగ్ చేసుకుంటూ ఉండడంతో ఆ వీడియోని మ్యూచువల్ ఫాన్స్ నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు.

షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ లు క్యాజువల్ గా కలిస్తేనే అది నేషనల్ వైడ్ ట్రెండింగ్ టాపిక్ అయ్యిందే… అదే ఈ ఇద్దరూ కలిసి స్క్రీన్ పైన యాక్షన్ మూవీ చేస్తే ఎలా ఉంటుంది? ఆ క్వేషన్ ని ఆన్సర్ గానే ‘పఠాన్’ సినిమా రాబోతోంది. షారుఖ్ హీరోగా నటిస్తున్న ఈ స్పై యాక్షన్ మూవీలో సల్మాన్ ఖాన్ ‘ఏజెంట్ టైగర్’గా ఎక్స్టెండెడ్ క్యామియో ప్లే చేస్తున్నాడు. జనవరి 25న ప్రేక్షకుల ముందుకి రానున్న పఠాన్ మూవీపై భారి అంచనాలు ఉన్నాయి. అలాగే షారుఖ్ ఖాన్ కూడా ‘పఠాన్’గా సల్మాన్ ఖాన్ నటిస్తున్న ‘టైగర్ 3’ సినిమాలో కనిపించనున్నాడు. ‘టైగర్ ఫ్రాంచైజ్’కి మంచి మార్కెట్ ఉంది, ఈ సీరీస్ లో సల్మాన్ ఖాన్ ‘ఇండియన్ రా ఏజెంట్’గా కనిపిస్తూ ఉంటాడు. ఇప్పటికే ఈ ఫ్రాంచైజ్ నుంచి రెండు సినిమాలు బయటకి వచ్చి సూపర్ హిట్స్ అవ్వగా మూడో సినిమా ప్రస్తుతం సెట్స్ పై ఉంది. పఠాన్, టైగర్ 3 సినిమాలు బాలీవుడ్ ని సేవ్ చేసే ప్రాజెక్ట్స్ గా పేరు తెచ్చుకున్నాయి. మరి ఈ రెండు సినిమాలతో ‘షారుఖ్ ఖాన్’ అండ్ ‘సల్మాన్ ఖాన్’లు బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని సేవ్ చేస్తారో లేదో తెలియదు అంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.

Exit mobile version