Site icon NTV Telugu

VD 11 : నాని రిజెక్ట్ చేసిందే విజయ్ చేస్తున్నాడా..?

Vd

Vd

సినిమా రంగంలో అన్ని అనుకున్నట్లు జరగవు.. కొన్నిసార్లు జీవితాలు తారుమారు అయ్యినట్లే కథలు కూడా తారుమారు అవుతూ ఉంటాయి. ఒక హీరోను ఉహించుకొని కథను రాసుకున్న డైరెక్టర్ కొన్నిసార్లు వేరే హీరోతో ఆ కథను తీయాల్సి వస్తుంది. ఇంకొన్ని సార్లు చివరి నిమిషంలో హీరో మారిపోతూ ఉంటాడు. ఇలాంటివి ఇండస్ట్రీలో జరుగుతూనే ఉంటాయి. ఇక తాజాగా విజయ్ దేవరకొండ విషయంలో కూడా అదే జరుగుతుందా..? అంటే నిజమేనని అంటున్నారు ఇండస్ట్రీ వర్గాలు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ- శివ నిర్వాణ దర్శకత్వంలో ఒక లవ్ స్టోరీ తెరకెక్కుతున్న విషయం తెల్సిందే.  నేడు పూజా కార్యక్రమాలను జరుపుకున్న ఈ సినిమాలో విజయ్ సరసన సమంత నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాను నాని వదులుకున్నాకే వీడీకి వచ్చిందని వార్తలు గుప్పుమంటున్నాయి.

నాని- శివ నిర్వాణ కాంబోలో ఇప్పటికే నిన్నుకోరి, టక్ జగదీష్ వచ్చాయి. నిన్నుకోరి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలువగా.. టక్ జగదీష్ ప్లాప్ ను మూటగట్టుకుంది. ఇక ఈ ప్లాప్ తరువాత నానికి చెప్పిన కథే ఇదని, శివతో మరోసారి రిస్క్ చేయడం ఇష్టం లేని నాని ఆ కథను సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. ఆ తర్వాత శివ అదే స్క్రిప్ట్ ని విజయ్ కి చెప్పాడని, అతను దానిని చేయడానికి అంగీకరించాడని తెలుస్తోంది. కాశ్మీర్ నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ సినిమా ఉండబోతోందని సమాచారం. ఏదిఏమైనా నాని రిజెక్ట్ చేసిన కథను విజయ్ దేవరకొండ ఒప్పుకోవడం, అది వెంటనే సెట్స్ మీదకు వెళ్లడం కూడా జరిగిపోయాయి.  ఒకవేళ ఈ సినిమా హిట్ అయితే నాని అనవసరం గా వదులుకున్నాడని, ఒకవేళ ప్లాప్ అయితే మంచి పని చేశాడని నెటిజన్లు మాట్లాడుకోవడం కామనే.. మరి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version