మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాల గురించి ప్రత్యేకముగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ప్రతి సినిమాలోను కొన్ని స్పెషల్ ఎలిమెంట్స్ ఉంటాయి. త్రివిక్రమ్ సినిమా అంటే.. సీనియర్ హీరోయిన్, సెకండ్ హీరోయిన్ ఖచ్చితంగా ఉండాలి. అది అందరికి తెలిసిందే. ఇక త్రివిక్రమ్ సినిమా అంటే సెకండ్ హీరోయిన్ కి పెద్దగా ప్రాధాన్యత ఉండదు. ఇంపార్టెన్స్ లేదు కదా అని నార్మల్ హీరోయిన్ ను ఈ డైరెక్టర్ తీసుకోడు. ఖచ్చితంగా ఆ పాత్రకు కూడా స్టార్ హీరోయిన్ ఉండాల్సిదే.. జల్సా దగ్గరనుంచి అల వైకుంఠపురంలో వరకు మాటల మాంత్రికుడు కథలో కానీ, ఆయన ఆలోచనలో కానీ ఎలాంటి మార్పు రాలేదు. అయితే తాజాగా మొట్టమొదటిసారి త్రివిక్రమ్.. ఒక హీరోయిన్ కోసం తన కథలో మార్పులు చేశాడట. ఆ హీరోయిన్ ఎవరో కాదు యంగ్ బ్యూటీ శ్రీ లీల.
ప్రస్తుతం త్రివిక్రమ్- మహేష్ బాబు కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతున్న విషయం విదితమే. ఇప్పటికే పూజా కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇక ఈ చిత్రంలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న విషయం విదితమే.. అయితే తాజాగా ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ పాత్రకు గాను పెళ్లి సందD బ్యూటీ శ్రీలీల ను ఎంపిక చేయాలని త్రివిక్రమ్ ప్లాన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఆమెను అప్రోచ్ అవ్వగా త్రివిక్రమ్ సినిమాల్లో సెకండ్ హీరోయిన్ పాత్రకు ప్రాధాన్యత ఉండదని మొదట ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేసిందట ముద్దుగుమ్మ.. ఆ తరువాత ఎలాగైనా శ్రీలీలను ఎట్టి మహేష్ బాబుతో నటింపజేయడం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న త్రివిక్రమ్ స్క్రిప్ట్ లో చిన్న మార్పులు చేశాడట.. అంతేకాకుండా మహేష్ కు, శ్రీలీల కు ఒక సాంగ్ కూడా పెట్టాడట. దీంతో అమ్మడు వెంటనే ఓకే చెప్పినట్లు సమాచారం. ఏదిఏమైనా ఒక హీరోయిన్ కోసం త్రివిక్రమ్ కథలో మార్పులు చేయడం అంటే కొద్దిగా విశేషమనే చెప్పాలి. మరి ఈ సినిమాను శ్రీ లీల ను ఎలా చూపించనున్నాడో చూడాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.
