Site icon NTV Telugu

NTR 30: ఎన్టీఆర్ అభిమానులకు బ్యాడ్ న్యూస్..?

Ntr

Ntr

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే ఆర్ఆర్ఆర్ చిత్రంతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న విషయం విదితమే. ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్- శివ కొరటాల కాంబోలో ఒక సినిమా తెరకెక్కుతుంది. ఎన్టీఆర్ 30 గా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ ఫ్యాన్స్ కు ఇంకా ఎదురుచూపులు తప్పేలా లేవు. ఈ సినిమా ఆగస్టులో పట్టాలెక్కనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన విషయం విదితమే. ఇక ఈ సినిమా కోసమే ఎన్టీఆర్ బరువు తగ్గి కొత్త లుక్ లోకి కూడా మారిపోయాడు.

ఎన్టీఆర్ బర్త్ డే రోజు రిలీజ్ చేసిన పోస్టర్ లో ఎన్టీఆర్ లుక్ ఆకట్టుకొంటుంది. దీంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. అయితే ఆచార్య ఎఫెక్ట్ తో శివ కొరటాల కొద్దిగా ఆలోచనలో పడ్డాడని, అందుకే మళ్లీ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయడమే కాకుండా మొదటి నుంచి మళ్ళీ క్రాస్ చెక్ చేస్తున్నాడట.. అందుకే ఈ సినిమా ఆగస్టు లో కాకుండా సెప్టెంబర్ లో పట్టాలెక్కనున్నదని సమాచారం. ఇదే కనుక నిజమైతే ఈ వార్త ఖచ్చితంగా ఎన్టీఆర్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇప్పటికే మూడు నెలలు ఖాళీగా ఉన్న ఎన్టీఆర్ ఇప్పుడు మరో రెండు నెలలు ఖాళీగా ఉండాలి. ఈ సినిమా సెప్టెంబర్ లో సెట్స్ మీదకు వెళ్తే ఎప్పుడు పూర్తవుతుంది..? ఎప్పుడు రిలీజ్ చేస్తారు..? ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. అదెప్పుడు పట్టాలెక్కుతోంది అంటూ అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version