Site icon NTV Telugu

God Father: ఆ పాత్ర లేకుండా ‘గాడ్ ఫాదర్’.. మరో ‘ఆచార్య’ అవ్వదు కదా..?

Chiru

Chiru

God Father: మెగాస్టార్ చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం గాడ్ ఫాదర్. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా అక్టోబర్ 5 న రిలీజ్ కానుంది. మలయాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు అధికారిక రీమేక్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు మేకర్స్. ఇందులో మోహన్ లాల్ పాత్రలో చిరు నటిస్తుండగా.. మంజు వారియర్ పాత్రలో నయనతార.. వివేక్ ఒబెరాయ్ పాత్రలో సత్యదేవ్ నటిస్తున్నారు. ఇక మలయాళంలో పృద్వీ రాజ్ సుకుమారన్ చేసిన పాత్రను తెలుగులో సల్మాన్ ఖాన్ చేస్తున్నాడు. తెలుగుకు తగ్గట్టు కథలో కొన్ని మార్పులు చేర్పులు చేసి దర్శకుడు తెరకెక్కించినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఒరిజినల్ సినిమాలోని ఒక కీలక పాత్రను తప్పించి సల్మాన్ ఖాన్ పాత్రను పెంచినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. లూసిఫర్ లో యంగ్ హీరో టోవినో థామస్ చేసిన పాత్రను తెలుగులో తొలగించారట మేకర్స్. ఈ పాత్ర సినిమాకే ప్రధాన బలం. హీరో తమ్ముడిగా టోవినో కనిపిస్తాడు. ఉండేది కొద్దిసేపే అయినా ఈ పాత్రే సినిమాకు బలం అని చెప్పొచ్చు.

తండ్రి వారసత్వాన్ని కొడుకుగా అందుకొనే పాత్ర.. అలాంటి ముఖ్యమైన పాత్రనే తెలుగులో తొలగించేశారు అని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ సినిమాపై అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇక సల్మాన్ పాత్ర ఒరిజినల్ లో ఒక 5 మినిట్స్ కంటే ఎక్కువ కనిపించదు. కానీ తెలుగులో మాత్రం సల్మాన్ కు ఒక సాంగ్, కొన్ని ఫైట్ సీక్వెన్స్ ను కూడా పెట్టారట. ఈ పాత్రను పెంచడానికి టోవినో పాత్రను తొలగించినట్లు రూమర్స్ వస్తున్నాయి. మొన్న ఆచార్యలో కూడా గెస్ట్ గా రామ్ చరణ్ ను అనౌన్స్ చేసి చివరికి సినిమా మొత్తం ఉన్నట్లు.. ఈ సినిమాలో కూడా అలాంటి తప్పేమి చేయడం లేదు కదా అని మెగా ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. మరి ఈ వార్తలో నిజం ఎంత అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు ఆగాల్సిందే.

Exit mobile version