మెలోడీ క్వీన్, నైటింగేల్ ఆఫ్ ఇండియాగా పేరు తెచ్చుకున్న ఇండియన్ సింగర్ ‘లతా మంగేష్కర్’గారు. 14కి పైగా భాషల్లో 50 వేల పాటలు పాడి సంగీత సరస్వతిగా అందరి మన్ననలు పొందిన లతాజీ, చనిపోయి అప్పుడే ఏడాది గడిచింది. 2022 ఫిబ్రవరి 6న లతాజీ మరణించారు. అత్యధిక పాటలు పాడిన ఫీమేల్ ప్లేబ్యాక్ సింగర్ గా లతాజీ గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా చోటు సంపాదించారు. ఆమె డెత్ యానివర్సరి రోజున లతాజీని గుర్తు చేసుకుంటూ “లతాజీకి మొదటి పాట కోసం 101/- చెక్ ఇచ్చాను” అని చెప్పాడు వెటరన్ మ్యూజిక్ డైరెక్టర్ ప్యారేలాల్. లతాజీతో దాదాపు 701 పాటలని పాడించిన ప్యారేలాల్, లక్ష్మీకాంత్ తో కలిసి మ్యూజిక్ కంపోజ్ చేసే వాళ్లు. ‘పరస్మని’ అనే సినిమా కోసం మొదటిసారి లతాజీతో పాట పాడించిన ప్యారేలాల్, 101 రూపాయల చెక్ ఇవ్వగానే, చాలా సంతోషంగా తీసుకున్నారని చెప్తూ లతాజీ గుర్తు చేసుకున్నారు. ప్యారేలాల్-లక్ష్మీకాంత్ తెలుగులో రెండు సినిమాలకి మాత్రమే మ్యూజిక్ కంపోజ్ చేశారు, అందులో ఒకటి ‘మజ్ను’ మూవీ. ఈ సినిమా మ్యూజికల్ గా సూపర్ హిట్ అయ్యింది. ఇంకొకటి ‘నేటి సిద్దార్థ్’ అనే టైటిల్ తో వచ్చింది కానీ ఈ మూవీ అక్కినేని అభిమానులకి కూడా గుర్తు ఉండి ఉండడు.
Lata Mangeshkar: ఈ లెజెండ్ మొదటి సంపాదన 101/-

Lata Mangeskar