Site icon NTV Telugu

Laggam: శరవేగంగా “లగ్గం” షూట్.. అప్పుడే ఒక షెడ్యూల్ అవగొట్టేశారా!

Laggam Shooting

Laggam Shooting

Laggam First Schedule Shooting Concluded: సుభిషి ఎంటర్త్సైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి నిర్మిస్తున్న లగ్గం సినిమా ఫిబ్రవరి 5 న పూజతో ప్రారంభమయింది. భీమదేవరపల్లి బ్రాంచి సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రమేష్ చెప్పాల ఈ సినిమాకు కథ అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ “లగ్గం” సినిమా శరవేగంగా షూటింగ్ చేస్తుండగా మొదటి షెడ్యూల్ ఈ రోజుతో పూర్తి చేసుకుంది. ఇక ఫిబ్రవరి 23 నుండి వర పూజతో రెండవ షెడ్యూల్ ప్రారంభం కానుందని సినిమా యూనిట్ ప్రకటించింది. ఇక మొదటి షెడ్యూల్ కామారెడ్డి పరిసర ప్రాంతాల్లో పచ్చని పొలాల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో షూట్ జరుపుకుంది.

రాజేంద్రప్రసాద్, రోహిణి, సాయి రోనాక్, ఎల్.బి శ్రీరామ్, సప్తగిరి వంటి సీనియర్ నటులు నటిస్తున్న ఈ చిత్రం కుటుంబ విలువలను, మర్చిపోతున్న సాంప్రదాయాలను, సంస్కృతిని మళ్లీ గుర్తుచేసే అరుదైన చిత్రంగా తెరకేక్కబోతుందని మేకర్స్ చెబుతున్నారు. చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి బొంతల నాగేశ్వర రెడ్డి ఎడిటర్. లగ్గం సినిమాకి బేబీ చిత్ర కెమెరామెన్ బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. సాయి రోనక్, రాజేంద్రప్రసాద్,రోహిణి,సప్తగిరి, ఎల్ బి.శ్రీరామ్, కృష్ణుడు, రఘుబాబు, రచ్చ రవి, కనకవ్వ, వడ్లమాని శ్రీనివాస్, కావేరి, చమ్మక్ చంద్ర, చిత్రం శ్రీను, సంధ్య, లక్ష్మణ్ మీసాల, ప్రభావతి. కంచరపాలెం రాజు, సత్తన్న , తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Exit mobile version