Lady Super Star : రీజనల్ సినిమాలకు స్వస్తి.. ఇకపై పాన్ ఇండియా, భారీ బడ్జెట్ చిత్రాలే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లేడీ సూపర్‌స్టార్‌గా ఎదిగిన నయనతార తన సినీ ప్రయాణంలో మరో బిగ్ ఛేంజ్‌కి శ్రీకారం చుట్టారు. రెగ్యులర్ రీజనల్ సినిమాలు, పరిమిత బడ్జెట్ చిత్రాలకు ఇక గుడ్ బై చెప్పేసినట్లే అని సంకేతాలు ఇస్తున్నారు. కేవలం పాన్ ఇండియా సినిమాలు,భారీ బడ్జెట్ చిత్రాలకే ఆమె గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఒకప్పుడు ఒకే భాషకు లేదా రీజనల్ స్టోరీస్‌కే ప్రాధాన్యం ఇచ్చిన నయన్, హిందీలో చేసిన ‘జవాన్’ సాధించిన ఘనవిజయంతో తన మార్కెట్‌ను ఊహించని రీతిలో పెంచుకున్నారు. ఇప్పుడు కేవలం ఐదు భాషల్లో ఒకేసారి విడుదలయ్యే దమ్మున్న కథలను, వందల కోట్ల బడ్జెట్ ఉన్న చిత్రాలనే తన కేలండర్లో లాక్ చేస్తున్నారు.
ఇండియన్ సినిమా మైండ్ బ్లాంక్ అయ్యే కాంబినేషన్లతో నయనతార సంచలనం సృష్టిస్తున్నారు. కెజియఫ్ ఫేమ్ యష్ హీరోగా, గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అంతర్జాతీయ స్థాయి గ్యాంగ్‌స్టర్ డ్రామా ‘టాక్సిక్’లో నయన్ అత్యంత కీలకమైన పవర్ఫుల్ పాత్రలో అలరించబోతున్నారు. దీనికి తోడు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో తెరకెక్కనున్న బిగ్ బడ్జెట్ హిందీ ప్రాజెక్ట్‌లోనూ నయనతార కథానాయికగా చేస్తోంది. ఈ ప్రాజెక్ట్ టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కిస్తుండగా.. దిల్ రాజు నిర్మిస్తున్నాడు. షారుఖ్ ఖాన్ తర్వాత సల్మాన్‌తో జతకడుతూ ఉత్తరాది బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటడానికి లేడీ సూపర్‌స్టార్ పక్కా ప్లాన్‌తో అడుగులు వేస్తున్నారు.
Also Read
- Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
- BhagyashriBorse : ఫ్లాపుల్లో భాగ్యశ్రీ బోర్సేకు వరుస ఆఫర్స్..సక్సెస్ తర్వాత నో ఛాన్స్
- Pooja Meri Jaan OTT: నాలుగేళ్ల తర్వాత మృణాల్ ఠాకూర్ థ్రిల్లర్‌కు మోక్షం.. ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి!
- The Vvaan: 400 ఏళ్ల ఆలయంలో సిద్ధార్థ్, తమన్నా ప్రత్యేక పూజలు.. గుడి మిస్టరీతోనే వస్తున్న కొత్త సినిమా
వలం బిగ్ స్టార్స్ పక్కన మెరవడమే కాదు… తన సోలో పవర్‌తోనూ పాన్-ఇండియా మార్కెట్‌ను ఏలేందుకు నయన్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా రాబోతున్న లేటెస్ట్ యాక్షన్ విజువల్ స్పెక్టాకిల్ ‘రక్కయి’. పూర్తిస్థాయి పిరియాడిక్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీ టీజర్‌కే నెటిజన్లు ఫిదా అయ్యారు.’రక్కయి’లో నయన్ చేస్తున్న ఊరమాస్ యాక్షన్ అవతార్ సౌత్ ఇండస్ట్రీలోనే సంచలనంగా మారింది. దీంతో పాటు విభిన్నమైన కాన్సెప్ట్‌తో రూపుదిద్దుకుంటున్న ‘హాయ్’ ప్రాజెక్ట్ కూడా ఇండియన్ వైడ్ ఆడియెన్స్‌ను టార్గెట్ చేస్తోంది. లేడీ ఓరియంటెడ్ చిత్రాలకు కూడా పాన్-ఇండియా రేంజ్ బిజినెస్ తీసుకురావడం ఒక్క నయనతారకే సాధ్యమవుతోంది.
తాజావార్తలు
-
Raptee.HV T30: రాప్టీ.హెచ్‌వి T30 ఎలక్ట్రిక్ బైక్.. 150KM రియల్ రేంజ్, కారు ఛార్జర్‌తో ఛార్జింగ్!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Global Fuel Crisis: అమెరికా, ఫ్రాన్స్, బ్రిటన్‌లో రికార్డ్ స్థాయికి చేరిన డీజిల్, పెట్రోల్ ధరలు.. నెక్ట్స్ భారత్ వంతేనా?
-
Sangeet First Single: ఏఆర్ రెహమాన్ చేతుల మీదుగా ‘నీ వల్లే’ సాంగ్ రిలీజ్.. సిద్ శ్రీరామ్ మెలోడీకి ఫిదా అవుతున్న ఫ్యాన్స్!
-
Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
ట్రెండింగ్
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!